Home /News /crime /

A YOUNG WOMAN FROM MADHYA PRADESH HAS FILED A COMPLAINT AGAINST HER PARENTS FOR WANTING TO COMMIT PROSTITUTION SNR

ఆమెను తల్లిదండ్రులే వ్యభిచారం చేయమంటున్నారు..వాళ్లను ఏం చేయాలి

Photo Credit: Youtube

Photo Credit: Youtube

OMG: కని పెంచిన కూతుర్ని వ్యభిచారం చేయమని తల్లిదండ్రులు వేధించారు. వాళ్లు పెట్టే చిత్రహింసలు భరించలేక, మురికి కూపంలోకి దిగలేక ఆ యువతి ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తన గోడును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
కన్నబిడ్డను వ్యభిచారం చేయమని తల్లిదండ్రులు బలవంతం చేసిన అత్యంత జుకుప్సాకరమైన ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో చోటుచేసుకుంది. తల్లి(Mother), తండ్రి(Father), మేనమామ (Uncle)ఇలా ఒకే ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని వ్యభిచార (Prostitution)రొంపిలోకి దింపాలని ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో కొట్టారు. చివరకు ప్రాణాలు తీస్తామంటూ బెదిరించారు. అయినా ఆ యువతి పెద్దలు చూపించిన చెడు మార్గంలో వెళ్లేందుకు అంగీకరించలేదు. వేరే యువకుడ్ని ప్రేమించింది. అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈవిషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు అతడ్ని కూడా కొట్టి..ఆ యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇదంతా మధ్యప్రదేశ్‌( Madhya Pradesh)రాష్ట్రం నీముచ్‌లో జరిగింది. బాంచా సామాజికవర్గానికి చెందిన యువతి నీముచ్‌ (Neemuch)పోలీస్ స్టేషన్‌కి సమీపంలో ఉన్న బోరెడ్డి (Borudi)గ్రామంలో నివసిస్తోంది. కొద్ది రోజుల క్రితమే కుక్‌దేశ్వర్ (Kukdeshwar)పోలీస్ స్టేషన్ పరిధిలోని మోయా (Moya) గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు parentsఆమెను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశారు. యువతి ఎంత తిరస్కరించినప్పటికి వాళ్లలో దుర్మార్గం మరింత పెరిగిపోవడంతో వేరే దారిలేక ఆ యువతి కన్నతల్లిదండ్రులతో పాటు మేనమామ బండారాన్ని బయటపెట్టింది. నచ్చిన యువకుడితో కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఫోన్‌లో రికార్డ్ (Video record)చేసి సోషల్ మీడియా(Social media)లో అప్‌లోడ్ చేశారు.

బిడ్డని వ్యభిచారం చేయమన్న పేరెంట్స్‌..
ఓ యువతి తనకు ప్రాణహాని ఉందని..వ్యభిచారకూపంలోకి కన్నవాళ్లే నెట్టాలని చూస్తున్నారని వేడుకుంటున్న వీడియో నీముచ్‌ పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేశారు. యువతి, యువకుల వివరాలు సేకరించి వారితో మాట్లాడారు. వాళ్లిద్దర నుంచి వాయిస్‌ రికార్డ్ చేశారు. మోయా గ్రామానికి చెందిన యువకుడ్ని ప్రేమించానని తనకు అతడితో వివాహం జరిపించి తమకు ప్రాణరక్షణ కల్పించాలని బాధిత యువతి పోలీసుల్ని వేడుకుంది. బాధిత యువతి తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినడం లేదని చివరకు ఆమె ప్రేమిస్తున్న యువకుడి ఇంటిని ధ్వంసం చేసి వాళ్ల కుటుంబ సభ్యులను బెదిరించారని వాపోయింది. తాను ఒక్కదాన్నే కాదు బాంచా సామాజికవర్గానికి చెందిన చాలా మంది అమ్మాయిలను వారి తల్లిదండ్రులు ఇలాగే మురిసి కూపంలోకి నెట్టాలని చూస్తున్నట్లు చెప్పింది. వాళ్లను కూడా అలాంటి రాక్షసుల చెర నుంచి విముక్తి కలిగించాలని వేడుకున్నారు.

వాళ్లను వదలడానికి వీల్లేదంతే..
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఆధారంగా బాధిత యువతి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు నీముచ్‌ ఏఎస్పీ సుందర్‌ సిన్హ్ కనేర తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో యువతి చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలుసుకొని వారి తల్లిదండ్రులు మేనమామపై చర్యలు తీసుకుంటామన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Love affair, Madhya pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు