పెళ్లైన మూడ్నేళ్లకే యువతి ఆత్మహత్య.. కారణం తెలిస్తే షాక్..

లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్నిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సంతోష కుమారి బుధవారం తాము నివసిస్తోన్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

news18-telugu
Updated: May 7, 2020, 8:15 PM IST
పెళ్లైన మూడ్నేళ్లకే యువతి ఆత్మహత్య.. కారణం తెలిస్తే షాక్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆ యువతికి నిరాశే మిగిలింది. అన్యోన్యంగా సాగాల్సిన కొత్త కాపురం కాస్త కలహాలతో నిత్యం యుద్ధభూమిని తలపించేంది. ఫలితంగా పెళ్లైన మూడ్నేళ్లకే ఆ యువతి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి తనువు చాలించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఇదిలావుంటే.. లాక్‌డౌన్ సమయంలో గృహ హింస కేసులు అధికమయ్యాయి. భార్య వేధింపులు భరించలేకపోతున్నామని భర్తలు, భర్తలు హింసిస్తున్నారంటూ భార్యలు ఘర్షణకు దిగుతున్నారు. కొన్నిచోట్ల ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లైన యువతి కథ ఈ కోవలోకి చెందుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాఘవేంద్రరావు, శేష సంతోషకుమారిలు నివాసం ఉంటున్నారు. వీరికి గత ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్నిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సంతోష కుమారి బుధవారం తాము నివసిస్తోన్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 7, 2020, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading