చెన్నై: తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పెళ్లయిన ఎనిమిది నెలలకు ఆమె జీవితంపై విరక్తితో ప్రాణాలు తీసుకుంది. ఆమె చనిపోవడానికి అత్తింటి నుంచి అదనపు కట్నం కోసం పెట్టిన వేధింపులే కారణమని తెలిసింది. ఇద్దరి కులాలు వేరైనప్పటికీ ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ప్రేమ వివాహం అయినప్పటికీ కట్నంగా బంగారం, డబ్బు బాగానే ముట్టజెప్పారు.
పెళ్లయిన కొన్నాళ్లు ఆమెను భర్తతో సహా అత్తింటి వారంతా బాగానే చూసుకున్నారు. కానీ.. గత కొన్ని నెలలుగా ఆమెను అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేశారు. తాను కొత్తగా బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటున్నానని.. అందుకు డబ్బు కావాలని ఆమె భర్త కూడా వేధించసాగాడు. చివరకు భర్త కూడా అర్థం చేసుకోకుండా వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య అత్తారింట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చనిపోయిన వివాహితను స్నేహ(25)గా గుర్తించారు. ఆమె భర్త విజయకుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు అత్తారింట్లో విగత జీవిగా ఉరికి వేలాడుతూ కనిపించేసరికి స్నేహ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటన ఇరుగుపొరుగు వారిని ఉలిక్కిపడేలా చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Crime news, Dowry harassment