హోమ్ /వార్తలు /క్రైమ్ /

Dubai Jobs: ఉద్యోగం వచ్చిందని దుబాయ్ ప్లైట్ ఎక్కాడు.. తిరిగొచ్చి సూసైడ్​ చేసుకున్నాడు.. అసలేమైంది?

Dubai Jobs: ఉద్యోగం వచ్చిందని దుబాయ్ ప్లైట్ ఎక్కాడు.. తిరిగొచ్చి సూసైడ్​ చేసుకున్నాడు.. అసలేమైంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బతుకు దెరువు కోసం దుబాయ్ (Dubai) వెళ్లాడు ఓ గిరిజనుడు (Tribal) . కొద్దిరోజుల తర్వాత తిరిగి స్వగ్రామానికి చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Medak, India

  (K Veeranna, News18, Medak)


  బతుకు దెరువు కోసం దుబాయ్ (Dubai) వెళ్లాడు ఓ గిరిజనుడు (Tribal).కొద్దిరోజుల తర్వాత తిరిగి స్వగ్రామానికి చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లా హవేలిఘనపూర్ మండలం స్కూల్ తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్ తండాకు చెందిన లంబాడీ గోపి(32) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తు న్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఏజెంట్ మోహన్ ద్వారా దుబాయ్ వెళ్లేందుకు సిద్ధ మయ్యాడు. దుబాయ్ కంపెనీ వివరాలు చెప్పడం తో నమ్మి డబ్బులు చెల్లించాడు. మూడు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు.


  అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోయినట్లు గోపి గ్రహించాడు. ఏజెంట్ మోహన్ చెప్పిన కంపెనీ కాకుండా మరో కంపెనీలో పని చూపించడం, ఆ ప్రాంతంలో ఆహారం, వాతావరణం పడకపోవడంతో కుటుంబీకుల ద్వారా డబ్బులు తెప్పించుకొని తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. దుబాయ్ వెళ్లి మూడు నెలల వ్యవధిలోనే తిరిగి రావడంతో రూ.2 లక్షలు అప్పు అయి ఏజెంట్ మోసంపై చర్యలు తీసుకోవాల్సిందిగా నెల  రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబీకులు తెలియజేశారు.  తనకు అన్యాయం చేశారనీ ఆత్మహత్యే శరణ్యమని అంటుండేవాడని స్థానికులు చెబుతున్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన గోపి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య గౌరీ, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మురళీ తెలిపారు.


  Fake Jobs: ఈమె మామూలు మహిళ కాదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమంటూ ఎంతకి తెగించింది..


  సరికొత్త ప్యాకేజీ..


  ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది. దేశీయంగానే కాదు... విదేశాలకూ పర్యాటకుల్ని తీసుకెళ్తోంది. ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.


  ఐదు రోజులు, నాలుగు రాత్రులతో దుబాయ్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. 'డాజ్లింగ్ దుబాయ్ ఇంటర్నేషనల్ టూర్ ఎక్స్ ముంబై' పేరుతో ప్యాకేజీ ప్రకటించింది.  'డాజ్లింగ్ దుబాయ్ ఇంటర్నేషనల్ టూర్ ఎక్స్ ముంబై' ప్యాకేజీ ధర రూ.50,990 నుంచి ప్రారంభమవుతుంది.ముంబై నుంచి షార్జా, దుబాయ్, అబుధాబీ ప్రాంతాలను పర్యాటకులకు చూపించనుంది.ఈ ఏడాది సెప్టెంబర్ 21, అక్టోబర్ 12, నవంబర్ 2, నవంబర్ 9, డిసెంబర్ 21, వచ్చే ఏడాది జనవరి 25 తేదీల్లో టూర్ మొదలవుతుంది.


  ఆసక్తిగలవాళ్లు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ రూ.50,990 నుంచి ప్రారంభమవుతుంది. అందులో విమాన ఛార్జీలు, త్రీ స్టార్ హోటళ్లలో బస, వీసా ఫీజ్, భోజనం, ఏసీ బస్సుల్లో ప్రయాణం కలిపే ఉంటుంది. ప్రతీ రోజు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ కలిపే ఉంటుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Attemp to suicide, Dubai, Fake jobs, Medak

  ఉత్తమ కథలు