క‌ృష్ణాజిల్లాలో విషాదం.. మట్టి పెళ్లలు మీదపడడంతో..

ప్రతీకాత్మక చిత్రం

తవ్విన మట్టిపెళ్లలను ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ప్రొక్లెయిన్ తవ్విన మట్టిపెళ్లలను ట్రాక్టర్‌లో వేస్తుండగా సమీపంలోని సాయిక‌ృష్ణ(17)పై పడ్డాయి.

  • Share this:
    కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడిపై మట్టిపెళ్లలు కూలి మీద పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లి గ్రామానికి చెందిన అరద వెంకటసుబ్బారావుకు చెందిన పొలంలో ఉన్న మట్టి పెళ్లలను పొక్లెయిన్‌తో చదును చేస్తున్నారు. తవ్విన మట్టిపెళ్లలను ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ప్రొక్లెయిన్ తవ్విన మట్టిపెళ్లలను ట్రాక్టర్‌లో వేస్తుండగా సమీపంలోని సాయిక‌ృష్ణ(17)పై పడ్డాయి. దీంతో సాయిక‌ృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: