హోమ్ /వార్తలు /క్రైమ్ /

chicken Murder: సార్​... నా కోడిని ఎవరో చంపేశారు.. వెంటనే పోస్టుమార్టం చేసి నిందితులను పట్టుకోండి

chicken Murder: సార్​... నా కోడిని ఎవరో చంపేశారు.. వెంటనే పోస్టుమార్టం చేసి నిందితులను పట్టుకోండి

ఇక  మొక్కజొన్న కిలో  12 రూపాయల నుంచి  24 రూపాయలకు పెరిగింది.  ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్‌ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయని చెపుతున్నారు వ్యాపారులు.

ఇక మొక్కజొన్న కిలో 12 రూపాయల నుంచి 24 రూపాయలకు పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్‌ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయని చెపుతున్నారు వ్యాపారులు.

ఇటీవల ఉత్తర ప్రదేశ్లో (Uttar Pradesh) నమోదైన ఓ కేసు మాత్రం పోలీసులకు (Police) తలనొప్పిగా మారింది. అదో వింత కేసు (Bizarre case) మరి. ఇంతకీ ఆ కేసు ఏంటంటారా? కోడి మర్డర్​ కేసు (Chicken murder case). అవును విన్నది నిజమే.. ఓ వ్యక్తి వచ్చి తన కోడిని ఎవరో మర్డర్​ చేశారని, విచారణ చేసి పట్టుకోవాలనడంతో పోలీసులకు నోట మాట రాలేదు. ఆ కేసు ఏంటో ఓ సారి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

దేశంలో కేసులు ఎక్కువయ్యాయంటూ ఓ వైపు పోలీసులు, మరోవైపు న్యాయమూర్తులు ఆందోళనలో ఉన్నారు. రోజుకు కనీసం వంద మర్డర్లు అయినా జరుగుతున్నాయి. చిన్నవి, పెద్దవి.. అలా కలిపితే కనీసం రోజుకు వేలాదిగానే కేసులు రిజిస్టర్​ అవుతున్నాయి పోలీస్​స్టేషన్లలో. వీటిని పరిష్కరించడం న్యాయమూర్తులకే కాదు పోలీసులకు కూడా తలకు మించిన భారమే అవుతోంది. అయితే ఎలాంటి కేసులు (cases) వచ్చినా నమోదు చేసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. సమాజంలో నేరాలు అరికట్టడం వారి విధి. అందుకే 24 గంటలూ విధుల్లోనే ఉంటారు. రాత్రి, పగలు అని చూడకుండా తిరుగుతూనే ఉంటారు. అయితే అన్ని కేసులు ఓకే కానీ, ఇటీవల ఉత్తర ప్రదేశ్లో (Uttar Pradesh) నమోదైన ఓ కేసు మాత్రం పోలీసులకు (Police) తలనొప్పిగా మారింది. అదో వింత కేసు (Bizarre case) మరి.  ఇంతకీ ఆ కేసు ఏంటంటారా? కోడి మర్డర్​ కేసు (Chicken murder case). అవును విన్నది నిజమే.. ఓ వ్యక్తి వచ్చి తన కోడిని ఎవరో మర్డర్​ చేశారని, విచారణ చేసి పట్టుకోవాలనడంతో పోలీసులకు నోట మాట రాలేదు. ఆ కేసు ఏంటో ఓ సారి తెలుసుకుందాం..

పోస్టుమార్టం చేయమంటూ..

ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని మహారాజ్‌ గంజ్‌ జిల్లా సింధూరియన్ (Sindhoorian). ఓ వ్యక్తి చచ్చిపోయిన కోడిని పట్టుకుని సింధూరియన్ పోలీస్టేషన్​ గడప ఎక్కాడు.. తన కోడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషం (poison) పెట్టి చంపేశారని.. తాను ఈ విషయంపై ఫిర్యాదు (Complaint) చేయడానికి వచ్చానని చెప్పాడు. అంతేకాదు.. కేసు నమోదు చేసి పోస్టుమార్టం (Post-mortem) నిర్వహించి నేరస్తులను (Criminals) పట్టుకోవాలని పోలీసులకు సలహా ఇచ్చాడు. కోడి (Chicken) కేసు విన్న పోలీసులు షాక్ తిన్నారు.. అయితే కోడి ని మర్డర్ చేశారంటూ వచ్చిన వ్యక్తి.. సామాన్యుడు కాదు..  సాక్ష్యాత్తు మాజీ ఎమ్మెల్యే తనయుడు (Ex MLA son) మరి.. దీంతో పోలీసుల ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు.

ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడట..

పిప్ర కళ్యాణ్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్ కుమారుడు రాజ్ కుమార్ భారతి (Raj kumar Bharati) సింధూరియన్ (Sindhoorian) పోలీస్ స్టేషన్‌లో తన పెంపుడు కోడి ని ఎవరో మర్డర్ (murder) చేశారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు తానూ ఈ కోడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నానని.. ఇప్పుడు ఎవరో విషం పెట్టి చంపేశారని, పోస్ట్ మార్టం చేయించి నిందితుడ్ని పట్టుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పక్షుల ప్రేమికుడు..

పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఘటనపై రాజ్‌ కుమార్‌ భారతి స్పందించాడు. తాను పక్షుల ప్రేమికుడిని (birds lover).. తన దగ్గర చిలుకలు, పావురాలు, కోళ్లు ఉన్నాయని.. వాటిని ఎంతో ముద్దుగా ప్రేమగా పెంచుకుంటున్నానని చెప్పాడు. తాను అంటే ఇష్టం లేని వారు ఎవరో తన ముద్దుల కోడిని విషం పెట్టి చంపేశారంటూ వాపోయాడు. తన కోడిని చంపేసిన నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నాడు.

First published:

Tags: Case filed, Chicken, Hen, Murder, Police station, Uttar pradesh

ఉత్తమ కథలు