హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral Video: రేయ్.. నడి రోడ్డుపై ఏంట్రా ఇది.. ఆ చేతులు ఎక్కడ పెడుతున్నావ్.. ఏం చేస్తున్నావ్..

Viral Video: రేయ్.. నడి రోడ్డుపై ఏంట్రా ఇది.. ఆ చేతులు ఎక్కడ పెడుతున్నావ్.. ఏం చేస్తున్నావ్..

వీడియోలోని దృశ్యాలు

వీడియోలోని దృశ్యాలు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగింది. ఓ మహిళను వెంటపడుతూ వేధిస్తున్న ఓ యువకుడు ఏకంగా ఆమె ఇంటి ముందుకు వచ్చి హస్త ప్రయోగం చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన షాక్‌కు గురిచేసింది.

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగింది. ఓ మహిళను వెంటపడుతూ వేధిస్తున్న ఓ యువకుడు ఏకంగా ఆమె ఇంటి ముందుకు వచ్చి హస్త ప్రయోగం చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన షాక్‌కు గురిచేసింది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.

ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని షాజహానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆ వివాహితకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి ఓ యువకుడు ఆమె వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. ఆ యువకుడికి బుద్ధి చెప్పే లోపే స్కూటీపై తుర్రుమని జారుకుంటున్నాడు. ఆ యువకుడు రానురానూ మరింత దిగజారిపోయాడు.

ఏకంగా ఓల్డ్ భోపాల్‌లో ఆ మహిళ ఉంటున్న ఇంటి వద్దకు స్కూటీపై వెళ్లాడు. ఆ మహిళ ఇంటి మేడపై ఉండటం గమనించాడు. స్కూటీ ఆమె ఇంటి దగ్గర్లో ఆపి ఆమెను చూస్తూ హస్త ప్రయోగం చేశాడు. ఆమె ఇల్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంది. భోపాల్‌లోనే ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్రాంతం అది. రోడ్డుపై వాహనాలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవేవి పట్టించుకోకుండా.. అంత మంది చూస్తున్నారనే సిగ్గు కూడా లేకుండా ఆ యువకుడు హస్త ప్రయోగం చేస్తూనే ఉన్నాడు.


ముఖానికి మాస్క్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. దీంతో.. తనను ఎవరూ గుర్తుపట్టరన్న ధైర్యంతో ఇంత నీచానికి దిగజారాడు. ఆ మహిళ ఒకానొక సమయానికి ఈ యువకుడిని చూసి ఒక్కసారిగా షాకైంది. అతను చేస్తున్న పని చూసి ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. తన భర్తను తీసుకుని బయటకు వచ్చేందుకు కిందకు వెళ్లింది. అప్పటికీ ఆ యువకుడు మారలేదు. ఆమె వస్తున్న సంగతి గమనించి మరింతగా ఆమె ఇంటి ముందుకు వెళ్లి గేటు బయట స్కూటీపై కూర్చుని హస్త ప్రయోగం చేశాడు.

ఇది కూడా చదవండి: Viral Video: ఇంటి ముందు ఉన్న స్కూటీ తీసేందుకు వెళితే ఏం జరిగిందో వీడియోలో చూడండి..

ఆ మహిళ గేటు తీసి బయటకు వచ్చి ఆ యువకుడిని పట్టుకుని బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ.. ఆ యువకుడు స్కూటీ స్టార్ట్ చేసి ఉంచుకోవడంతో ఆమె పట్టుకునే లోపే అక్కడి నుంచి స్కూటీపై పారిపోయాడు. తన ఇంటి ముందు ఆ యువకుడు చేసిన పనిపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువకుడు కొన్ని రోజులుగా తనను ఇబ్బంది పెడుతున్నాడని.. ఇప్పుడు ఏకంగా తన ఇంటి ముందుకు వచ్చి హస్త ప్రయోగం చేస్తూ నీచంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొంది. పోలీసులు ఆమె ఫిర్యాదుతో ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ ఆకతాయిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఆ యువకుడి గురించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ యువకుడు ఎవరో ఆ మహిళకు తెలియదు. ఆమె వెంటపడిన ప్రతిసారి స్కూటీపై వెళుతూ ఉండేవాడు. ముఖానికి మాస్క్, తలకు హెల్మెట్ ధరించేవాడు. దీంతో.. ఆ యువకుడు ఎలా ఉంటాడనే విషయం బాధిత వివాహితకు తెలియలేదు.

First published:

Tags: Bhopal, Crime news, Madhya pradesh, Sexual harrassment, Viral Video

ఉత్తమ కథలు