మొబైల్ నెట్‌వర్క్ కోసమని కొండెక్కాడు.. ఏదో అడవి జంతువు అనుకుని..

అక్కడ ఓ రాయిపై కూర్చుని మొబైల్ చూస్తున్నాడు. అయితే ఆ యువకుడిని దూరం నుంచి చూసిన కవలకొప్ప గొంటనాళ రామకన్నానాయక్ అనే వేటగాడు అది ఏదో అడవి జంతువు అనుకుని తుపాకీతో కాల్చాడు.

news18-telugu
Updated: May 24, 2020, 8:29 PM IST
మొబైల్ నెట్‌వర్క్ కోసమని కొండెక్కాడు.. ఏదో అడవి జంతువు అనుకుని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి ఇంట్లో మొబైల్ నెట్‌వర్క్ అందడం లేదని రాత్రి సమయంలో సమీపంలోని ఓ కొండపైకి ఎక్కాడు. అది అడవి జంతువు అనుకుని ఓ వేటగాడు తుపాకీతో కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర కన్నడ తాలూకా కవలకొప్ప గ్రామం గొంటనాళకు చెందిన ప్రదీప్‌నారాయణ్ గౌడ అనే యువకుడు మొబైల్ నెట్‌వర్క్ సరిగా అందడం లేదని రాత్రి సమయంలో సమీపంలోని కొండను ఎక్కాడు. అక్కడ ఓ రాయిపై కూర్చుని మొబైల్ చూస్తున్నాడు. అయితే ఆ యువకుడిని దూరం నుంచి చూసిన కవలకొప్ప గొంటనాళ రామకన్నానాయక్ అనే వేటగాడు అది ఏదో అడవి జంతువు అనుకుని తుపాకీతో కాల్చాడు. దీంతో బుల్లెట్ ఆ యువకుడి కుడికాలు, పొట్టబాగంలోకి దూసుకెళ్లింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 24, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading