• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A YOUNG MAN RAPING A THREE YEAR OLD CHILD IN JAMMU KASHMIR BN

దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి..

దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

పవన్ సింగ్(18) అనే యువకుడు ఆ చిన్నారిని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి.. ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.

  • Share this:
    కామంతో కళ్లు మూసుకుపోయి అభంశుభం తెలియని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. దేశమంతా కరోనా వైరస్ వ్యాప్తితో వణికిపోతుంటే.. ఆ దుర్మార్గుడు మాత్రం కామంతో మూడేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాకు చెందిన ఓ చిన్నారి(3 సంవత్సరాలు) ఇంటి ముందు ఆడుకుంటోంది. పొరుగింటి వ్యక్తి అయిన పవన్ సింగ్(18) అనే యువకుడు ఆ చిన్నారిని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి.. ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.

    చిన్నారి ఏడుపు విన్న ఆమె తల్లి ఇంటిలోకి వెళ్లి చూడగా, చిన్నారి అపాస్మరక స్థితిలో పడి ఉంది. వెంటనే చిన్నారిని హాస్పిటల్‌కు తరలించారు. చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పవన్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల రిపోర్టులు రాగానే వాటి ఆధారంగా తర్వాతి విచరాణ చేస్తామని పోలీసులు వివరించారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు