హోమ్ /వార్తలు /క్రైమ్ /

Instagram : అమ్మాయి మోసం చేస్తే కుటుంబం కాపాడింది.. కానీ నవీన్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..

Instagram : అమ్మాయి మోసం చేస్తే కుటుంబం కాపాడింది.. కానీ నవీన్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..

నల్గొండ యువకుడు నవీన్

నల్గొండ యువకుడు నవీన్

అమ్మాయిల చేతిలో దారుణంగా మోసపోయిన యువకుల గాథల్లో ఇది మరో రకం. అబ్బాయిపై మోహాన్ని వలగా విసిరి, మాయ మాటలతో బురిడీ కొట్టించి, భారీ మొత్తాన్ని దోచేసిందా యువతి. అది తట్టుకోలేక అతను బలవన్మరణానికి ప్రయత్నించగా చివరి నిమిషంలో కుటుంబీకులు కాపాడారు. కానీ ఆ ప్రాణం ఎంతోకాలం నిలవలేదు. అమ్మాయి మోసాన్ని మర్చిపోలేక, ఇంట్లోవాళ్ల ప్రేమనూ భరించలేక.. ఎవరూ కాపాడలేని విధంగా తనువు చాలించాడా యువకుడు..

ఇంకా చదవండి ...

Instagramలో పరిచయమైన అమ్మాయి కొద్ది రోజుల్లోనే అతనికి బాగా కనెక్ట్ అయింది.. పగలూ రాత్రి చాటింగ్ చేసుకునేవాళ్లు.. మెల్లగా ఆమె తన ప్లాన్ అమల్లోకి తెచ్చింది.. చదువుకుంటూనే ఈజీగా డబ్బలు సంపాదించ్చని, రూ.1లక్ష చెల్లిస్తే రూ.3లక్షలు వస్తాయని, ప్రస్తుతం తాను అదే బిజినెస్ లో రాణిస్తున్నానని నమ్మబలికింది. అప్పటికే ఆమె మాటల బుట్టలో పడిపోయిన యువకుడు రూ.లక్ష చెల్లించాడు. తీరా మోసపోయానని తెలిశాక ఆత్మహత్యాయత్నం చేశాడు. అదృవశాత్తూ కుటుంబీకులు అతణ్ని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడుకోగలిగారు. కానీ ఆమె మోసాన్ని మర్చిపోలేకపోయిన ఆ యువకుడు.. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండోసారీ బలవన్మరణానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తూ ఈసారి అతణ్ని ఎవరూ కాపాడలేకపోయారు. నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు చెప్పిన వివరాలివి..

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన ఓ గుర్తుతెలియని యువతి చేతిలో దారుణంగా మోసపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న వైనం నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడెంకు చెందిన గోగికార్‌ నవీన్‌ అలియాస్‌ చింటు (23)కు కొద్ది రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. చాటిగ్ తోనే బాగా దగ్గరైపోవడంతో ఆమెను చూడకుండానే పీకల్లోతు నమ్మకాన్ని ఏర్పర్చుకున్నాడు నవీన్..

Matchbox : అమ్మ బాబోయ్.. అగ్గి పెట్టె ధర 2రూపాయలు -14ఏళ్ల తర్వాత పెంపు -ఇక రూపాయికి వచ్చే వస్తువేది?


తాను వ్యాపారం చేస్తుంటానని నవీన్ ను నమ్మించిన ఆ యువతి.. తాను నడిపే బిజినెస్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు వస్తాయని చెప్పేది. లాభానికి తానే గ్యారంటీ అని, తొలి సంపాదన తర్వాత కలిసి ఎంజాయ్ చేద్దామని అతణ్ని ముగ్గులోకి దింపింది. దీంతో నవీన్‌ ఆమె ఆన్‌లైన్‌ ఖాతాలో రూ. లక్ష చెల్లించాడు. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య చాటింగ్ దాదాపు తగ్గిపోయింది.

అనుమానాస్పదంగానే ఆ యువతిని రూ.3 లక్షల కోసం నవీన్ నిలదీయగా, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేసింది. అప్పుడుగానీ తాను మోసపోయిన విషయాన్ని నవీన్ గుర్తించాడు. ఇంట్లో వాళ్ల నుంచి తీసుకున్న లక్షకు ఏమని బదులివ్వాలో అర్థంకాక, ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతణ్ని ఆస్పత్రికి తరలించి మొత్తానికి ప్రాణాలు కాపాడగలిగారు. కానీ..

rape: ట్రైనీ ఐఏఎస్ మృగేందర్‌పై రేప్ కేసు -వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కొడుకు నిర్వాకమిదే..


అమ్మాయి చేతిలో మోసపోయిన నవీన్ నెల రోజుల కిందట తొలిసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబీకులు కాపాడారు. డబ్బు పోతే పోయిందిలే.. అని ఓదార్చారు. కానీ సదరు మోసాన్ని ఎంతకూ మర్చిపోలేకోపోయిన నవీన్.. అదే బాధలో శనివారం నాడు బలవన్మరణానికి ప్రయత్నించాడు. నల్గొండ పట్టణం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇలా చేస్తాడని ఊహించలేకపోయామని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ గుర్తుతెలియని మోసకారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Cheating, Instagram, Nalgonda, Nalgonda police, Suicide

ఉత్తమ కథలు