బాలికను ప్రేమించానని నమ్మించి.. అసభ్య వీడియోలు తీసి.. ఆపై అత్యాచారం..

బాలికను తన ఇంటికి తీసుకొచ్చి అత్యాచారం చేశారు. 20 రోజుల పాటు ఇంట్లో బంధించి వైధింపులకు పాల్పడ్డాడు. బాలికను అసభ్యకరంగా వీడియోలు తీసి తన మిత్రులతో లైంగికంగా కలవాలంటూ బెదిరింపులకు దిగాడు.

news18-telugu
Updated: May 24, 2020, 3:08 PM IST
బాలికను ప్రేమించానని నమ్మించి.. అసభ్య వీడియోలు తీసి.. ఆపై అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సమాజంలో రోజురోజూకీ మృగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. అభంశుభం తెలియని బాలికపై తమ కామవాంఛలను తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఓ బాలికను ప్రేమించానని నమ్మించి.. అసభ్యకర వీడియోలు తీశాడు. ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన రామయ్య అనే యువకుడు తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో బేల్దార్ పనులు చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఓ బాలికను ప్రేమించానని నమ్మించాడు. ఆ బాలికను తన ఇంటికి తీసుకొచ్చి అత్యాచారం చేశారు. 20 రోజుల పాటు ఇంట్లో బంధించి వైధింపులకు పాల్పడ్డాడు. బాలికను అసభ్యకరంగా వీడియోలు తీసి తన మిత్రులతో లైంగికంగా కలవాలంటూ బెదిరింపులకు దిగాడు. అనంతరం రామయ్య స్నేహితులూ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. వేధింపులకు భయపడి అతడి వద్ద నంుచి బాలిక తప్పించుకుని ఒంగోలుకు చేరుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ బాలికను అధికారులు క్వారంటైన్‌కు పంపారు. అధికారులు ఆ బాలికను ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Published by: Narsimha Badhini
First published: May 24, 2020, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading