ప్రేమ పేరుతో యువతిని పాడుబడిన బంగ్లాకు తీసుకెళ్లి...ముగ్గురు స్నేహితులతో కలిసి...దారుణం...

బేగుసరాయ్ సమీపంలోని ఓ నిర్మానుష్య బంగళాకు తీసుకెళ్లిన యువకుడు, అక్కడ తన ముగ్గురు స్నేహితులను అక్కడికి పిలిపించాడు. అక్కడ యువతిని అత్యాచారయత్నం చేసేందుకు నలుగురూ ప్రయత్నించగా, ఆమె కేకలు పెడుతూ పరిగెట్టింది.

news18-telugu
Updated: June 30, 2020, 11:48 PM IST
ప్రేమ పేరుతో యువతిని పాడుబడిన బంగ్లాకు తీసుకెళ్లి...ముగ్గురు స్నేహితులతో కలిసి...దారుణం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రేమ పేరుతో అమ్మాయిలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లోని బేగుసరాయ్ జిల్లాలో ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిపై తన స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని (19) కాలేజీలో చదువుతుండగా, అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి (19) పరిచయం అయ్యాడు. వారి స్నేహం ప్రేమగా మారగా, ఆమెను తీసుకుని బేగుసరాయ్ సమీపంలోని ఓ నిర్మానుష్య బంగళాకు తీసుకెళ్లిన యువకుడు, అక్కడ తన ముగ్గురు స్నేహితులను అక్కడికి పిలిపించాడు. అక్కడ యువతిని అత్యాచారయత్నం చేసేందుకు నలుగురూ ప్రయత్నించగా, ఆమె కేకలు పెడుతూ పరిగెట్టింది.

అక్కడికి సమీపంలోనే వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ కి ఆమె కేకలు వినిపించగా, అతను ఆమెను ఆటో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. దీంతో ముగ్గురు స్నేహితులూ పరారుకాగా, ప్రియుడు పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
First published: June 30, 2020, 11:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading