Home /News /crime /

A YOUNG FARMER WAS KILLED WHILE PLOWING FIELD IN PEDDAPALLY MS

పొలంలో పని చేసుకుంటుంటే.. పొడిచేశారు.. పెద్దపల్లిలో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ యువకుడు ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు. ఇంతలో పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో అక్కడికి వచ్చారు. తనకోసం కాదనుకున్న ఆ రైతు.. వారిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నాడు. కానీ ఆ దుండగులు ఒక్కసారిగా వచ్చి...

  • News18
  • Last Updated :
    ఆ యువకడు పొలంలో పని చేసుకుంటున్నాడు. రైతులు వర్షాకాల పంట కోసి.. వేసంగి పంటకు పొలాలను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో... తాను కూడా దుక్కిని సిద్దం చేస్తున్నాడు. ట్రాక్టర్ మీద ఎక్కి.. పొలాన్ని దున్నుతుండగా.. అక్కడకు పలువురు వచ్చారు. వారిని చూసీ చూడనట్టు వదిలేసిన ఆ యువకుడు.. తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ ఆ దుండగులు సరాసరి.. పొలంలోకి వెళ్లి.. అతడిపై దాడికి దిగారు. వారి చేతుల్లో కత్తులు. అతడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దున్నిన పొలం కావడంతో తప్పించుకుని పారిపోయే వీలు కూడా లేకపోయింది. అయినా ప్రతిఘటించాడు. కానీ వచ్చిన గుంపు అతడు తప్పించుకోకుండా అడ్డుకున్నారు. వెంట తెచ్చుకున్న కత్తులతో అతడిని దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

    వివరాల్లోకెళ్తే... పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసిందీ ఘటన. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిరాల గ్రామ శివారులో సందేల రమేశ్ (25) శుక్రవారం ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు. ఇంతలో పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో అక్కడికి వచ్చారు. తనకోసం కాదనుకున్న రమేశ్.. వారిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నాడు. కానీ ఆ దుండగులు ఒక్కసారిగా వచ్చి రమేశ్ పై కత్తులతో దాడి చేశారు. తప్పించుకునే ప్రయత్నం చేసిప్పటికీ మెడ, తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో రమేశ్‌ పొలంలోనే ప్రాణాలు విడిచాడు.

    ఇది కూడా చదవండి.. Telangana: అత్త వేధింపులు తాళలేక అల్లుడి ఆత్మహత్య... ఆస్పత్రిలో కూతురు

    చనిపోయిన రమేశ్.. జగిత్యాల జిల్లా ధర్మారం మండలం నందిమేడారం. వివాహేతర సంబంధం లేదా ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Crime, Crime news, Farmer, Murder, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు