HOME »NEWS »CRIME »a women tea stall owner throws tea on police finally arrested in bihar nk gh

Crime: పోలీసుపై కోపంతో వేడి టీ పోసిన మహిళ... అసలు ఏం జరిగిందంటే?

Crime: పోలీసుపై కోపంతో వేడి టీ పోసిన మహిళ... అసలు ఏం జరిగిందంటే?
ప్రతీకాత్మక చిత్రం

తన కోపమే తనకు శత్రువు అంటుంటారు పెద్దలు. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఆ మహిళ విషయంలో ఏమైందో తెలుసుకుందాం.

  • Share this:
మనుషులకు కోపం వస్తే కొన్నిసార్లు ఏం చేస్తారో వారికే తెలియదు. కోపంలో నియంత్రణ ఉండకపోతే అనేకసార్లు బాధపడాల్సి వస్తుంది. అవును నిజమే.. తాజాగా బీహార్ లో ఓ మహిళ.. పోలీసు ముఖంపైనే వేడి వేడి టీ పోసేసింది. బీహార్ లోని ముజాఫర్ పూర్ లో శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ ఆసుపత్రి(SKMCH) క్యాంపస్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. తర్వాత మహిళను పోలీసులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కళాశాల క్యాంపస్ కు బయట టీ దుకాణాన్ని నడుపుకుంటోంది రసులాపుర్ సలీం గ్రామానికి చెందిన సరితా దేవి అనే మహిళ. కాలేజీ ప్రాంగణంలో ఎలాంటి దుకాణాలు ఉంచకూడదని ఆదేశాలు రావడంతో వాటిని తొలగించేందుకు అహియాపుర్ పోలీసు స్టేషన్ కు చెందిన సుమన్ జా అక్కడకు వచ్చారు. దీంతో దుకాణుదారుతో వాగ్వివాదంతో చోటుచేసుకోవడంతో సరితా దేవి కోపంతో వేడి వేడి టీని ఆయనపై పోసేసింది. దాడి చేసినందుకు గాను పోలీసులు ఎఫ్ఐర్ నమోదు చేశారు.

అయితే మహిళను అరెస్టు చేయగా.. ఆమె సహచరులు ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలో దిగినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సునీల్ రజాక్ తెలిపారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఆయన అన్నారు. కావాలనే మహిళతో పాటు ఆమె సహచరులు తనపై టీ పోసేసి దాడి చేశారని సుమన్ ప్రకటనలో తెలిపారు.



చట్టవిరుద్ధంగా నడుపుతున్న టీ, స్నాక్స్ దుకాణాలను తొలగించాలని సమాచారం వచ్చిందని తూర్పు గేట్ సమీపంలోని ఆక్రమణలను తొలగించాలనే ఆదేశించారని సుమన్ చెప్పారు. క్యాంపస్ లోని అక్రమ దుకాణాల వల్ల రోగులు, వారి పరిచారకులు, వైద్యులు, ఇతర సిబ్బందికి అనేక సమస్యలు వస్తున్నాయని ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ వికాస్ కుమార్ లిఖిత ఫూర్వక ఫిర్యాదు ఆధారంగా తాను అక్కడకు చేరుకున్నానని తెలిపారు.

ఇది కూడా చదవండి : Thrilling Murder Case: థ్రిల్లింగ్ క్రైమ్... పండ్ల వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు

"నేను సరిత టీ దుకాణం దగ్గరకు చేరుకుని షాపు తొలగించాలని అన్నాను. ఆమె అప్పుడు కోపంగా ఉంది. ముందుగా నన్ను బాగా తిట్టి.. కోపంతో నా ముఖంపై వేడి టీని విసిరింది. నేను అక్కడే పడిపోగా.. దగ్గరలోనే సెక్యూరుటీ సిబ్బంది అత్యవసర వార్డుకు నన్ను తీసుకెళ్లారు" అని సుమన్ తన స్టేట్ మెంట్ లో తెలిపారు.
Published by:Krishna Kumar N
First published:December 26, 2020, 12:41 IST

टॉप स्टोरीज