• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A WOMAN WHO WAS ALLEGEDLY CAUGHT RAPING A 14 YEAR OLD BOY IS NOW SAID TO BE PREGNANT WITH HIS CHILD SSR

Paragould woman: ఈ మహిళను రేప్ కేసులో అరెస్ట్ చేయగా.. మరో షాకింగ్ విషయం బయటపడింది..!

Paragould woman: ఈ మహిళను రేప్ కేసులో అరెస్ట్ చేయగా.. మరో షాకింగ్ విషయం బయటపడింది..!

బ్రిట్నీ గ్రే

ప్రస్తుత సమాజంలో కొందరిలో శారీరక వ్యామోహం రోజురోజుకూ పెరిగిపోతోంది. లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. అమెరికాలోని అర్కన్సాస్ రాష్ట్రంలో ఓ 32 ఏళ్ల యువతి 14 ఏళ్ల మైనర్‌ను లైంగికంగా...

  • Share this:
    అర్కన్సాస్: ప్రస్తుత సమాజంలో కొందరిలో శారీరక వ్యామోహం రోజురోజుకూ పెరిగిపోతోంది. లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. అమెరికాలోని అర్కన్సాస్ రాష్ట్రంలో ఓ 32 ఏళ్ల యువతి 14 ఏళ్ల మైనర్‌ను లైంగికంగా లొంగతీసుకుంది. ఆ కేసులో పోలీసులు బ్రిట్నీ గ్రేను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 28, 2020న అర్కన్సాస్ చైల్డ్ అబ్యూస్ హాట్‌లైన్‌కు ఆమె నడుపుతున్న ఎఫైర్‌కు సంబంధించి సమాచారం అందింది.

    సెప్టెంబర్ 29న కూడా ఇందుకు సంబంధించి మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది. అయితే.. ఫోన్ చేసిన వ్యక్తి బ్రిట్నీ గ్రే ఆ మైనర్ బాలుడితో శృంగారం చేస్తుండగా తాను కళ్లారా చూశానని చెప్పాడు. జనవరి 22, 2021న ఆ సాక్షిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆ బాలుడితో దాదాపు సంవత్సరం నుంచి బ్రిట్నీ లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. అంతేకాదు, పోలీసులకు దిమ్మతిరిగే మరో విషయాన్ని కూడా ఆ సాక్షి బయటపెట్టాడు. ఆ మహిళ ప్రస్తుతం గర్భంతో ఉందని చెప్పాడు.

    ఈ విషయంపై నిజ నిర్ధారణ కోసం బ్రిట్నీ పరీక్షలు చేయించుకున్న స్థానిక ఆసుపత్రిని సంప్రదించగా ప్రస్తుతం ఆమె గర్భంతో ఉందని స్పష్టమైంది. ఆ మైనర్, బ్రిట్నీ కలిసి ఆసుపత్రికి వెళ్లిన వీడియో ఫుటేజి కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కేసులో బ్రిట్నీ గ్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. కోర్టు విధించిన 5వేల డాలర్ల బాండ్‌ను బ్రిట్నీ సమర్పించడంతో బ్రిట్నీ గురువారం విడుదలైంది. ఏప్రిల్ 23న ఇదే కేసు విచారణలో బ్రిట్నీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు