మియామీ బీచ్‌లో మహిళ అరెస్ట్... తాబేలు గూడు పాడు చేసిందని...

Florida : అరుదైన జీవజాతుల్లో తాబేళ్లు కూడా ఉన్నాయి. వాటిని కాపాడేందుకు చాలా దేశాలు నానా తిప్పలు పడుతుంటే, ఆ మహిళ మాత్రం తాబేలు గూటిని పాడు చేసి, అడ్డంగా బుక్కైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 12:48 PM IST
మియామీ బీచ్‌లో మహిళ అరెస్ట్... తాబేలు గూడు పాడు చేసిందని...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన దేశంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కాపాడేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయో... అమెరికా ఫ్లోరిడాలో కూడా... అక్కడి తాబేళ్లను సంరక్షించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అలాంటిది 41 ఏళ్ల యాకన్ లూ అనే మహిళ... మియామీ బీచ్‌లో తాబేలు నిర్మించుకున్న గూటిని సర్వ నాశనం చేసింది. సాధారణంగా తాబేళ్లు గూళ్లు కట్టుకోవు. గుడ్లు పెట్టే ముందే అవి గొయ్యి తవ్వుకుంటాయి. ఆ మహిళ... మరే ప్లేసూ దొరకనట్లు... వెళ్లి వెళ్లి ఆ గొయ్యిపైనే చిందులు తొక్కింది. గొయ్యిని పూడుకుపోయింది. అక్కడి ఓ వన్యప్రాణి ప్రేమికుడు అది చూశాడు. అల్లాడిపోయాడు. అరెరే తాబేలు కట్టుకున్న గూటిని నాశనం చేసేసింది... ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిందే అనుకొని... పోలీసులకు కాల్ చేశాడు.

రెండు నిమిషాల్లో అక్కడకు వచ్చిన పోలీసులు... జరిగిన దారుణాన్ని కళ్లారా చూశారు. వెంటనే ఆ దృశ్యాన్ని ఫొటో తీసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు... ఇక అటువైపు పర్యాటకులు ఎవరూ రాకుండా... ఎల్లో టేప్స్ పెట్టారు. అక్కడ "డు నాట్ డిస్టర్బ్ సీ టర్టిల్ నెస్ట్" (తాబేళ్ల గూళ్లను పాడుచెయ్యవద్దు) అని రాశారు.

చైనాకు చెందిన యాకన్ లూపై రెండు కేసులు నమోదయ్యాయి. 1.తాబేళ్లకు హాని కలిగించడం, 2.తాబేళ్ల గుడ్లు నాశనం చెయ్యడం. మిచిగాన్‌లోని తన అడ్రెస్‌ని వాళ్లకు ఇచ్చిన ఆమె... త్వరలోనే కోర్టు నోటీసులు అందుకోబోతోంది.

1973 నాటి ఫ్లోరిడా అరుదైన అంతరించిపోయే జీవుల చట్టం ప్రకారం తాబేళ్లను ముట్టుకోవడం, హాని చెయ్యడం, గుడ్లను టచ్ చెయ్యడం, నాశనం చెయ్యడం వంటివి నేరం కింద లెక్క. మియామీ బీచ్‌లో లాగ్గర్ హెడ్, గ్రీన్, లెదర్ బ్యాక్ జాతి తాబేళ్లు జీవిస్తున్నాయి. అవి ఏప్రిల్ నుంచీ నవంబర్ వరకూ గూళ్లు కట్టుకుంటాయి. తాజా కేసులో గుడ్లు మాత్రం నాశనం కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.ఇవి కూడా చదవండి :

వాళ్లిద్దరూ లవర్స్... ఆతనిపై యాసిడ్ పోసి... తనపైనా పోసుకుంది... ఎందుకంటే...

కానిస్టేబుల్ కామ పురాణం... అర్థరాత్రి యువతిని బ్లాక్‌మెయిల్ చేసి...

మనం బ్లాక్‌హోల్‌లో ఉన్నామా... సైంటిస్టుల షాకింగ్ థియరీ...

Published by: Krishna Kumar N
First published: June 17, 2019, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading