Home /News /crime /

A WOMAN WAS ABDUCTED BY THUGS AND LOCKED IN A ROOM SEXUALLY HARASSED FOR NINE DAYS VB

ఆమెకు 20 ఏళ్లు.. నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన ఆమెను దండగులు అపహరించారు.. తొమ్మిది రోజులు గదిలో బంధించి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: ఓ మహిళను దుండగులు అపహరించి ఓ గదిలో బంధించారు. తొమ్మిది రోజులపాటు లైంగికంగా వేధించారు. ఎట్టకేలకు బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరియాణాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
    ఇంట్లో తాగడానికి నీళ్లను తీసుకురావడానికి ఓ వివాహిత ఒంటరిగా ఊరి చివరకు బయలుదేరింది. నీళ్లను తీసుకొని ఇంటికి తరిగి వెళ్తుండగా ఎదురుగా ఆమెకు తెలిసిన వ్యక్తి తారసపడ్డాడు. నీతో మాట్లాడాలి.. రేపు గుడికి రమ్మని అతడు ఆమెకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. చెప్పిన మాట ప్రకారం ఆమె అతడితో మాట్లాడటానికి గుడికి వెళ్లింది. అతడితో మాట్లాడుతుండగా ఆ గుడిలోకి ఇద్దరు కారులో వచ్చారు. వాళ్లు ఆమె మాట్లాడుతున్న వ్యక్తి స్నేహితులు. దీంతో ముగ్గురు కలిసి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి సమీపంలోని పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లు ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి ఆ రోజు రాత్రి అత్యాచారం చేశారు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన ఆమెకు గదిలో మొత్తం బీరు బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లు చూసి భయపడి పోయింది. తనను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారంటూ గొడవ చేస్తుండగా ఆమెపై వాళ్లు చెయ్యి చేసుకున్నారు. తెల్లారి మరొక వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. ఆ వ్యక్తితో కలిసి నలుగురు కలిసి దాదాపు తొమ్మిది రోజుల పాటు మత్తు మందు ఇస్తూ.. చిత్ర హింసలకు గురి చేస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

    ఈ సమయంలోనే వారు ఈ ఘటనకు సంబంధించి వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియోను బయటపెడతామని బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. హర్యానాలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  హర్యానాలోని గుర్గావ్ జిల్లాలోని సోహ్నా గ్రామానికి చెందిన వివాహిత(20) గత నెల జూన్ 30న నీళ్లు తీసుకురావడానికి ఊరి చివరకు వెళ్లింది. తిరుగు మార్గంలో చింటు అనే పరిచయస్తుడు ఆమెకు కలిశాడు. నీతో మాట్లాడాలి.. రేపు గుడి దగ్గరకు రమ్మని బాధితురాలిని కోరాడు. దాంతో మరుసటి రోజు బాధితురాలు.. గుడి దగ్గరికి వెళ్లింది. ఆ వ్యక్తితో మాట్లాడుతుండగా.. అతని ఇద్దరు స్నేహితులు దీపక్, సంజూ కారులో వచ్చారు. అనంతరం వారు ముగ్గురు బాధితురాలిని బలవంతంగా కారులో ఫరీదాబాద్ తీసుకెళ్లారు.

    అక్కడ ఆమెకు నిద్రమాత్రలు కలిపిన వాటర్ తాగడానికి ఇచ్చారు. దాంతో బాధితురాలు మత్తులోకి జారుకుంది. కొన్ని గంటల తర్వాత మెలకువలోకి వచ్చిన బాధితురాలికి ఆ గదిలో మందు బాటిళ్లు, సిగరెట్ పీకలు కనిపించాయి. దాంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ తర్వాత మరుసటి రోజు బాధితురాలి పక్క గ్రామానికి చెందిని కుల్దీప్ అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. మరో వ్యక్తితో కలిసి నలుగురు దుండగులు ఆమెను ఆ గదిలో నిర్భందించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విధంగా ప్రతిరోజూ మత్తుమందు ఇస్తూ.. తొమ్మిది రోజులపాటు బాధితురాలికి నరకం చూపించారు. నిందితులు ఘటనను మొత్తం వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని హెచ్చరించారు. కాగా.. బాధితురాలు ఇంటికి రాకపోవడంతో జూన్ 29న ఆమెకు భర్త ఫోన్ చేశాడు. ఆ సమయంలో నిందితులు ఆమెకు గన్ పెట్టి.. తాను స్నేహితుల ఇంట్లో ఉన్నానని.. కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పమని బెదిరించారు.

    చివరకు తొమ్మిది రోజుల తర్వాత జూలై 8న బాధితురాలిని బల్లభ్‌ఘర్ బస్టాండ్‌లో విడిచిపెట్టారు. అక్కడి నుంచి వారి కుటుంబానికి ఫోన్‌ చేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. భర్త సాయంతో జూలై 11న సోహ్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను అహరించిన వారు తనకు తెలుసని, వారిలో ఒకరు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సోహ్నా స్టేషన్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ తెలిపారు. త్వరలో ఆ నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Gang rape, Haryana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు