షాపింగ్ మాల్‌లో చెత్త పని చేసిన యువతి

ఆమె పేరు గ్రేస్ అని, పబ్లిక్ ప్రదేశాల్లో ఇలా చేయడం ఆమె అలవాటని తెలిపారు. గతంలో కూడా ఆమె ఇలాంటి పనులు చేసిందని పోలీసుల పరిశోధనలో తేలింది.

news18-telugu
Updated: August 3, 2019, 10:59 AM IST
షాపింగ్ మాల్‌లో చెత్త పని చేసిన యువతి
షాపింగ్ మాల్‌లో చెత్త చేసిన పని
  • Share this:
ఆ మధ్య ఓ యువతి షాపింగ్ మాల్‌లో సగం డ్రింక్ తాగి మళ్లీ ఫ్రీజ్‌లో పెట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ యువతి చేసిన పనికి అందరూ షాక్ తింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో యూరిన్ వెళ్లకుూడదంటూ చాలా చోట్ల మనం బోర్డులు చూస్తుంటే. చాలా ప్రాంతాల్లో గోడలపై కూడా ఇదే రాస్తుంటారు. మనదేశంలో అయితే మోదీ బహిర్గత మలమూత్ర విసర్జన మానేయాలంటూ ప్రతీ ఇంటికి మరుగు దొడ్డి అంటూ పెద్ద ప్రచారమే చేశారు.

కానీ అమెరికాలో ఓ యువతి షాపింగ్ మాల్ లో చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది.  వివరాల్లోకి వెళితే పెన్సిల్వేనియాకు చెందిన ఓ యువతి ప్రముఖ రిటైల్ స్టోర్ వాల్ మార్ట్ కు వెళ్లింది. అక్కడే ఉన్న బంగాళదుంపలపై మూత్ర విసర్జన చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. అయితే ఈ మొత్తం ఘటన స్టోర్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.

ఈ యువతి చేసిన పనితో దిమ్మతిరిగిన స్టోర్ యాజమాన్యం పోలీసులు ఫిర్యాదుచేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యువతిని గుర్తించారు. ఆమె పేరు గ్రేస్ అని, పబ్లిక్ ప్రదేశాల్లో ఇలా చేయడం ఆమె అలవాటని తెలిపారు. గతంలో కూడా ఆమె ఇలాంటి పనులు చేసిందని పోలీసుల పరిశోధనలో తేలింది. ఇంకా పబ్లిక్ ప్రదేశాల్లో అలాంటి పని చేయడం ఆమెకి అలవాటని తేలడంతో పోలీసులు, నెటిజన్లు సైతం షాక్ తింటున్నారు.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు