Shocking: ఫోన్ విషయంలో చిన్న గొడవ ఎంత వరకూ వెళ్లిందో చూడండి.. ఫోన్‌లో పాటలు వింటుంటే..

పోలీసుల అదుపులో నిందితురాలు రేష్మా

కొందరు మహిళల్లో నేర ప్రవృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని థానా గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. మొబైల్ విషయంలో గొడవ రావడంతో పక్కింటి మహిళను మరో మహిళ కత్తితో గొంతు కోసి చంపిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తస్లిమా బేగమ్, రేష్మ మధ్య మొబైల్ విషయంలో గొడవ జరిగింది.

  • Share this:
    యూపీ: కొందరు మహిళల్లో నేర ప్రవృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని థానా గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. మొబైల్ విషయంలో గొడవ రావడంతో పక్కింటి మహిళను మరో మహిళ కత్తితో గొంతు కోసి చంపిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తస్లిమా బేగమ్, రేష్మ మధ్య మొబైల్ విషయంలో గొడవ జరిగింది. రేష్మా తన మొబైల్‌లో పాటలు వింటుండగా.. తస్లిమా బేగమ్ కూతురి వల్ల పొరపాటున రేష్మా మొబైల్ నీళ్లలో పడింది. ఈ కారణంగా.. రేష్మ వెళ్లి తస్లిమాతో గొడవ పెట్టుకుంది. చిన్నపాటి గొడవగా మొదలైన ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది.

    క్షణికావేశంలో.. పట్టరాని కోపంతో రేష్మ తస్లిమాపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో తస్లిమా గొంతు తెగడంతో ఆమె స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు చెబుతూ.. తస్లిమా ఫోన్‌ను బాగు చేయిస్తానని రేష్మకు చెప్పినా ఆమె వినిపించుకోలేదని.. నేరుగా ఆమెపై కత్తితో దాడికి దిగిందని చెప్పారు. థానా గంజ్ ప్రాంతంలో ఒకే ఇంట్లో తస్లిమా కుటుంబం, రేష్మా కుటుంబం నివాసముంటోంది.

    రేష్మా తస్లిమాపై ఏవో పాత పగలు కూడా పెంచుకుని ఆమెపై దాడికి దిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రేష్మాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తస్లిమా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రేష్మాపై కేసు నమోదు చేశారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు తస్లిమా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published: