కోతికి చక్కలిగింతలు పెట్టినందుకు ఓ మహిళకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈ ఘటన ఈజిప్టులో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... 25 సంవత్సరాలు ఉన్న ఓ యువతి ఈజిప్టులోని నైల్ డెల్టా నగరంలో ఓ పెట్ షాప్ దగ్గర ఉన్న కోతి జననాంగాలను తాకింది. అలా తాకుతూ... కోతిని నవ్వించడానికి ప్రయత్నించింది. అయితే దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో ఆ యువతి కోతి పట్ల ఆ విధంగా ప్రవర్తించడంపై అక్కడి ప్రజలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కోతి పట్ల ఆ యువతి తీరుపై అక్కడి కోర్టు విచారించి, బహిరంగా కోతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆ యువతికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోతి పట్ల ఈ చర్య సరైనది కాదని, ఇది కోతిని లైగింకగా వేధించడం లాంటిదని కోర్టు ఆ తీర్పులో పెర్కోంది. విస్తుపోయిన ఆ యువతి మాత్రం.. తాను కేవలం కోతిని నవ్వించడానికే అలా చేశానని.. అంతేకాని కోతిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం తన ఉద్దేశం కాదని అంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.