Home /News /crime /

A WOMAN IN ODISHA ABANDONED HER HUSBAND ALLEGEDLY AFTER HE RECENTLY TESTED POSITIVE FOR HIV SSR

Husband: భర్తకు హెచ్‌ఐవీ సోకిందని తెలిసి ఈ భార్య ఏం చేసిందో చూడండి.. అతనికీ ఎలా తెలిసిందంటే..

సూట్‌కేస్ తీసుకుని వెళ్లిపోతున్న భార్య

సూట్‌కేస్ తీసుకుని వెళ్లిపోతున్న భార్య

ఒడిశాలోని భద్రక్ జిల్లా బొంత్ తాలూకాలో వెలుగుచూసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భర్తకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలియడంతో భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

    భద్రక్: ఒడిశాలోని భద్రక్ జిల్లా బొంత్ తాలూకాలో వెలుగుచూసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భర్తకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలియడంతో భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ దంపతులకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఒక కూతురు కూడా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం తమ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సదరు వ్యక్తి రక్తదానం చేశాడు. తర్వాత.. అతని రక్తాన్ని పరిశీలించగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. అయితే.. ఈ విషయాన్ని భార్యతో చెప్పడంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలియగానే సూట్‌కేస్ సర్దుకుని, కూతురుని తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

    ఇది కూడా చదవండి: OMG: ఇదెక్కడి గలీజు పని బాబూ.. ‘గే’ సెక్స్ రాకెట్ నడుపుతూ దొరికిపోయారుగా.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

    ఈ పరిణామంపై భర్త స్పందిస్తూ.. ‘కొన్ని రోజుల క్రితం బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో నేను బ్లడ్ డొనేట్ చేశాను. అయితే.. నా బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించిన డాక్టర్ నన్ను హాస్పిటల్‌కు రమ్మని పిలిచారు. నేను హాస్పిటల్‌కు వెళ్లగా నాకు హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. నేను తిరిగి ఇంటికొచ్చాను. ఈ విషయాన్ని నా భార్యతో చెప్పాను. అలా చెప్పానో.. లేదో.. వెంటనే నాతో గొడవ పడి పాపను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది’ అని భర్త చెప్పాడు.

    ఇది కూడా చదవండి: Married Woman: అసలు ఈ ఘటన గురించి తెలిశాక ఏం చెప్తాం.. ఈ ఇద్దరూ కలిసి చేసిన పని వల్ల..

    తనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసిందని తెలిపాడు. ఆమెకు సంబంధించినవి అన్నీ ఇంట్లో లేకుండా తీసుకుని వెళ్లిపోయిందని చెప్పాడు. తాను ఆమెకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించానని, కానీ ఆమె ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేదని ఆమె భర్త తెలిపాడు. అయితే.. భార్య వాదన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అత్తింట్లో తనకు వేధింపులు రోజురోజుకూ ఎక్కువయ్యాయని, శారీరకంగా కూడా హింసిస్తున్నారని.. ఆ వేధింపులు తట్టుకోలేక భర్తను, ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పెళ్లి సమయంలో తన కుటుంబం ఇచ్చిన కానుకలను, డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది.

    ఇది కూడా చదవండి: Family: భార్యాభర్తలు.. ఒక పాప.. బాబు.. ఇంత చక్కగా ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు లేదు.. ఏమైందంటే..

    అంతేకాకుండా.. నా భర్తకు హెచ్‌ఐవీ సోకడానికి కూడా తానే కారణమని అత్త నిందలేసి హింసిస్తోందని.. నాపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారని సదరు భార్య సంచలన ఆరోపణలు చేసింది. ఒకసారి అత్తింట్లో ఇలా చేస్తున్నారని తన గోడు వెళ్లబోసుకునేందుకు గ్రామ సర్పంచ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే తనను కొట్టారని చెప్పింది. అయితే.. అత్త వాదన మరోలా ఉంది. ఆమెకు పరిస్థితిని వివరించడానికి ఎన్నో విధాలుగా చెప్పి చూశామని, కానీ ఆమె ఎవరు చెప్పినా ఆలకించడం లేదని అత్త కోడలి గురించి చెప్పింది. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని అత్త చెప్పుకొచ్చింది. కోడలు ఇల్లు వదిలి వెళ్లిపోవడం ఎవరికీ ఇష్టం లేదని, తమతోనే ఉండాలని ఆశిస్తున్నామని అత్త తెలిపింది. ఇదిలా ఉండగా.. సదరు భార్యకు పోలీసులు, గ్రామస్తులు ఎంతగానో చెప్పి చూశారని, ఇలాంటి కష్ట సమయంలో భర్తకు అండగా ఉండాలని అందరూ చెప్పినా ఆమె వినిపించుకోలేదని ఈ కుటుంబానికి పొరుగున ఉండే నరేంద్ర జెనా చెప్పుకొచ్చారు. మొత్తం మీద హెచ్‌ఐవీ మహమ్మారి ఈ కుటుంబంలో కల్లోలానికి కారణమైంది. భార్య మనసు మార్చుకుని తిరిగి రావాలని ఆమె భర్త ఆశిస్తున్నాడు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, HIV, Husband, Odisha, Wife

    తదుపరి వార్తలు