Very Sad: రాత్రి భార్య కాళ్లకు చున్నీ కట్టి తన చేతికి కట్టుకుని పడుకున్న భర్త.. తెల్లారేసరికి ఊహించని ఘోరం

ఐలమతి (ఫైల్ ఫొటో)

భార్యాభర్తలు ఒకరికొకరు తోడునీడగా ఉండాలి. ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకోవాలి. ఒకరి భావాలను మరొకరు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే ఆ కాపురం సాఫీగా సాగుతుంది. ఇక్కడ ఈ మహిళ భర్త కూడా అలాంటి వ్యక్తే. మానసిక సమస్యతో బాధపడుతున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.

 • Share this:
  హైదరాబాద్: భార్యాభర్తలు ఒకరికొకరు తోడునీడగా ఉండాలి. ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకోవాలి. ఒకరి భావాలను మరొకరు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే ఆ కాపురం సాఫీగా సాగుతుంది. ఇక్కడ ఈ మహిళ భర్త కూడా అలాంటి వ్యక్తే. మానసిక సమస్యతో బాధపడుతున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. చికిత్స చేయిస్తూ ఆమెను తిరిగి మాములు స్థితిలో చూడాలని ఆశపడ్డాడు. భార్యకు వేళకు తినిపిస్తూ, మాత్రలు ఇస్తూ చూసుకుంటున్నాడు. అయితే.. ఆ భార్యకున్న మానసిక సమస్య ఆమె ప్రాణం పోయేలా చేసింది. భర్త కనిపెట్టుకుని ఉన్నప్పటికీ రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన భార్య అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నార్సింగ్ పరిధిలోని సెవన్‌హిల్స్ అపార్ట్‌‌మెంట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్.ఐలమతి(35) అనే వివాహిత భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సెవన్‌హిల్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఫ్యాక్టలీ విభాగంలో పనిచేస్తూ ఉండేది.

  అయితే.. ఐలమతి కొంతకాలంగా మానసిక సమస్యతో సతమతమవుతోంది. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు కావడంతో ఆమె బాగోగులను భర్త రాధాకృష్టే చూసుకునేవాడు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స చేయిస్తున్నాడు. అయితే.. చికిత్స జరుగుతున్నప్పటికీ ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా.. ఆగస్ట్ 15న కూరగాయలు కోసే కత్తితో పొడుచుకునేందుకు ప్రయత్నించింది. సమయానికి ఆమె భర్త ఇంట్లోనే ఉండటంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని రాధాకృష్ణ భావించినప్పటికీ ఆగస్ట్ 15న స్వాంతంత్ర్య దినోత్సవం కావడంతో సెలవు రోజు ఆసుపత్రి ఉండదని తెలిసి ఆగిపోయాడు. అదే రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె మళ్లీ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడి.. రాధాకృష్ణ ఆమె కాళ్లకు చున్నీ కట్టి తన చేతికి ఆ చున్నీని కట్టుకుని పడుకున్నాడు. అయితే.. రాధాకృష్ణ దేని గురించి భయపడ్డాడో ఆ రాత్రి అదే జరిగింది.

  Suryapet: నీలాంటి మంచోళ్లను బతకనివ్వరు తల్లీ.. నీకు జరిగినట్టు వేరే ఏ ఆడపిల్లకూ జరగకూడదు..

  రాధాకృష్ణ నిద్రిస్తున్న సమయంలో చడీచప్పుడు లేకుండా చున్నీని చేతి నుంచి తొలగించుకున్న ఐలమతి నేరుగా అపార్ట్‌మెంట్ పైకి ఎక్కింది. బాగా పొద్దుపోవడంతో అపార్ట్‌మెంట్‌లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరూ గమనించలేదు. ఆ సమయంలో అపార్ట్‌మెంట్ ఎక్కిన ఐలమతి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దూకిన సమయంలో శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్ వాసులంతా ఉలిక్కపడి లేచారు. అపార్ట్‌మెంట్ కింద ఉన్న సెక్యూరిటీ గార్డ్ భయంతో కేకలేశాడు. పోలీసులకు సమాచారం అందించడంతో కొంతసేపటికీ వాళ్లూ స్పాట్‌కు చేరుకున్నారు. భార్యను ఉదయాన్నే ఆసుపత్రికి తీసుకెళదామనుకున్నానని.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందని రాధాకృష్ణ కన్నీరుమున్నీరయ్యాడు. ఆమె ఇద్దరు పిల్లలు తల్లి మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అపార్ట్‌మెంట్‌వాసులను కంటతడి పెట్టించింది. పోలీసులు ఐలమతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: