A WOMAN HAS MURDERED HER HUSBAND BY SEARCHING ON GOOGLE WITH THE HELP OF HER BOYFRIEND FOR ALLEGEDLY INTERFERING IN AN EXTRAMARITAL AFFAIR VB
Extramarital Affair: చంపి పాతేయడం ఎలా..? గూగుల్ లో సెర్చ్ చేసి మరీ.. దారుణానికి ఒడిగట్టింది.. ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
Extramarital Affair: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడి సాయంతో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. హత్య ఎలా చేయాలి.. మృత దేహాన్ని ఎలా వదిలించుకోవాలి అని గూగుల్ సెర్చ్‌లో వెతికి పక్కా ప్రణాళిక రచించాక ఈ దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హద్రా జిల్లా ఖేడిపూర్ ప్రాంతంలో ఆమీర్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. భర్త దూరంగా ఉండడంతో అదే ఏరియాలో ఉంటున్న మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అతని భార్య టబస్సుమ్. వివాహేతర సంబంధినికి అడ్డు వస్తున్నాడని తన భర్తను చంపేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ప్రభావంతో పని లేకపోవడంతో అమీర్ ఓ రోజు ఇంటికి వచ్చేశాడు. ఆమె భర్త ఇటీవల కాలంలో ఇంటి వద్దే ఉండటంతో తబుస్సుమ్‌కు ఇబ్బందిగా మారింది. ఓ రోజు ఆమె అమీర్‌ను హత్య చేయడం కోసం ఒకరోజంతా గూగుల్‌లో హత్య ఎలా చేయాలి.. మృత దేహాన్ని ఎలా వదిలించుకోవాలి.. ఎవరి కంట పడకుండా పాతేయడం, ఆధారాలు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా? అనే విషయాల గురించి గూగుల్ లో వెతికింది. ఇలా 15 గంటలు ఏకధాటిగా సెర్చ్ చేసింది. ఈ క్రమంలో అతడిని అడ్డుతొలగించుకునేందుకు ఆమె ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఆమె భర్తకు అంతక ముందే అస్తమా ఉంది.
దీంతో అతడు రోజు అస్తమా మందులు వాడుతాడు. దీనిని ఆసరా చేసుకొని ఆమె ఓ రోజు అస్తమా మందుల్ని మార్చేసింది. వాటి స్థానంలో నకిలీ మందులు అతడికి ఇచ్చింది. దీంతో అతడు సోయి లేకుండా పడిపోయాడు. ఇక ప్రియుడు ఇర్ఫాన్‌ను అదే రాత్రి ఇంటికి పిలిపించుకుంది. అమీర్ కాళ్లు చేతుల్ని స్కార్ఫ్‌లతో కట్టేసి.. ఆపై సుత్తితో తల మీద బాది చంపేశారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. నిందితురాలు తబుస్సుమ్ స్వయంగా భర్త మరణం గురించి పోలీసులు దృష్టికి తెచ్చింది. తన భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడని నటించింది. ఈ దారుణం ఎలా జరిగిందో తనకు తెలీదంటూ పోలీసులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించింది. ఇంటిని దోచుకునే క్రమంలో నిందితులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు తొలుత భావించారు. కానీ.. తబుస్సుమ్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో వారు సైబర్ సెల్ సహాయం తీసుకోగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సైబర్ సెల్ నుంచి టబస్సుమ్ కాల్ డిటెయిల్స్ తెప్పించుకున్నారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని గూగుల్ హిస్టరీ ద్వారా ఒక అంచనాకి వచ్చారు. తమ స్టైల్లో ఇంటరాగేట్ చేయడంతో ఆమె నేరం ఒప్పుకుంది. నిందితురాలికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని దర్యాప్తులో తేలడంతో చిక్కుముడి వీడిపోయింది. వారు భార్యను ఆమె ప్రియుడిని హత్యానేరంపై అరెస్టు చేశారు. ఇక ఈ దారుణంపై అక్కడి టీవీ ఛానెల్స్ డిబేట్లు నడిపిస్తుండడంతో ఈ కేసు హాట్‌టాపిక్‌గా మారింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.