Home /News /crime /

Rape case on MLA: పెళ్లి, ఉద్యోగం సాకుతో ఆ ఎమ్మెల్యే అత్యాచారం చేశాడు.. బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ ఫిర్యాదు

Rape case on MLA: పెళ్లి, ఉద్యోగం సాకుతో ఆ ఎమ్మెల్యే అత్యాచారం చేశాడు.. బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ ఫిర్యాదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA)పై కేసు నమోదైంది. కాగా, ఇదివరకే ఆ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు ఉండటం గమనార్హం. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా గోగుండా బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్‌ భీల్‌ (MLA Pratap Bheel)పై ఈ కేసు నమోదైంది.

    అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA)పై కేసు నమోదైంది. కాగా, ఇదివరకే ఆ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు ఉండటం గమనార్హం. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా గోగుండా బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్‌ భీల్‌ (MLA Pratap Bhil)పై ఈ కేసు నమోదైంది. రెండు సందర్భాల్లోనూ ఎమ్మెల్యే పెళ్లి (marriage), ఉద్యోగం (job) సాకుతో మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనపై తొలి కేసు (first case) నమోదైంది. ఉదయ్‌పూర్ నగరంలోని అంబామత పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి రెండో కేసు నమోదు చేశారు.

    గత రెండేళ్లుగా..

    ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతాప్ (MLA Pratap Bhil) తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. గత రెండేళ్లుగా (since two years ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల ఉప ఎన్నికల తర్వాత ప్రతాప్‌ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, ఆ తర్వాత ఎమ్మెల్యే తనను బెదిరించాడని బాధితురాలు (Victim) పోలీసులకు తెలిపింది. ఎమ్మెల్యే MLA Pratap Bhil ప్రైవేట్ సిబ్బంది కూడా తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. ఎమ్మెల్యేకు కేసు కావడంతో బాధితురాలికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తును సీఐడీ క్రైం బ్రాంచ్‌ (CID Crime branch)కు అప్పగించారు.

    మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ..

    అత్యాచార ఆరోపణ (rape allegation)లపై ఎమ్మెల్యే ప్రతాప్​ స్పందించారు. సదరు మహిళ చేసిన ఆరోపణలపై ఆయన ఖండించారు. బాధితురాలు తనకు తెలియదని ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి (February)లో ఉద్యోగం, పెళ్లి సాకుతో ఎమ్మెల్యేపై అత్యాచారానికి పాల్పడ్డారని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఆరోపించడంతో ఎమ్మెల్యే ప్రతాప్‌ భీల్‌పై ఇదే తరహా కేసు నమోదు కావడం గమనార్హం. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. అత్యాచారం ఆరోపణలు రావటంతో బీజేపీ (BJP)పై కాంగ్రెస్, ఇతర పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్  (Suspend)చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

    జూలైలో బీజేపీ ఎమ్మెల్యేపై..

    కాగా, ఇదే ఏడాది జూలైలో సురేష్ రాథోర్ అనే బీజేపీ ఎమ్మెల్యేపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి చెందిన మహిళ కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. సురేష్ రాథోర్ అనే బీజేపీ ఎమ్మెల్యే జ్వాలాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే అతనిపై నియోజకర్గంలోని బేగంపూర గ్రామానికి చెందిన బీజేపీ మహిళ కార్యకర్త ఒకరు.. హరిద్వార్‌లోని బహద్రాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సురేష్ రాథోర్ తనపై కొద్ది నెలల క్రితం అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని సురేష్ తనను హెచ్చరించినట్టు పేర్కొన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bihar, Bjp, Rape case

    తదుపరి వార్తలు