Home /News /crime /

A WOMAN HAS ALLEGED IN FRONT OF THE MEDIA THAT TRS MLA THATIKONDA RAJAIAH BROTHER STATION GHANPUR SARPANCH SURESH SEXUALLY HARASSED HER PRV

TRS MLA brother: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సోదరుడు నన్ను చేయి పట్టుకుని లాగాడు.. మీడియా ముందు ఓ మహిళ ఆక్రందన

రాజయ్య (ఫైల్ ఫొటో)

రాజయ్య (ఫైల్ ఫొటో)

వివాదాలకు కేరాఫ్​ అడ్రస్​ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తాజాగా ఇక స్టేషన్ ఘనపూర్​​ సర్పంచ్, ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు తాటికొండ సురేష్ వివాదంలో పడ్డాడు. ఆయన తన చేయి పట్టుకుని లాగాడని ఓ మహిళ మీడియా ముఖంగా వెల్లడించంతో రచ్చ మొదలైంది.

ఇంకా చదవండి ...
  టీఆర్ఎస్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (TRS MLA Thatikonda Rajaiah).. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లకైనా ఈ పేరు తెలుసు. ఆయన గురించి చెప్పాలంటే తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి. . రాజకీయాలంటే అంతే. ఎవరికి ఎప్పుడు లక్కు కలిసొస్తుందో... ఎవరెలా కనుమరుగవుతారో తెలియదు. ఇందుకు రాజయ్యే ఓ ఉదాహరణ. ఐదేళ్లలో మూడు ఎన్నికల్లో వరుసగా గెలిచిన ట్రాక్ రికార్డ్ ఉన్న రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి వరించడం అంటే అదృష్టమే. కానీ ఆ అదృష్టం ఎక్కువ రోజులు ఉండలేదు. తన శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పదవి వదులుకోవాల్సి వచ్చింది. కొద్దిరోజుల తర్వాత రాజయ్య రాసలీలల పేరుతో ఆడియో లీకైంది. ఆ ఘటనతో ఆయన పరువు కూడా గంగలో కలిసిపోయింది. ఇక ఇటీవలైతే దళిత బంధు అర్హుల జాబితాలో రాజయ్య బంధువులను చేర్చడంతో వివాదం మరీ పెద్దదైంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరదీయడంతో వారందరి పేర్లు జాబితా నుంచి తొలగిచడం జరిగింది. ఇక స్టేషన్ ఘనపూర్​​ సర్పంచ్, ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు తాటికొండ సురేష్ ( Station Ghanpur Sarpanch Suresh )వివాదంలో పడ్డాడు.

  చేయి పట్టుకుని లాగారని..

  ఇంటి పర్మిషన్ (House Permission) ఇవ్వకుండా స్టేషన్ ఘనపూర్​​ సర్పంచ్, ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు తాటికొండ సురేష్ వేధింపులకు గురి చేస్తున్నట్లు (sexually harassed )జంగిటి విజయలక్ష్మి అనే ఓ మహిళ ఆరోపించింది. అంతేకాదు ఆఫీసుకు వెళితే తనను చేయి పట్టుకుని లాగారని ఆమె సంచలన ఆరోపణలు సైతం చేయడంతో కలకలం సృష్టిస్తోంది.

  బాధితురాలి కథనం ప్రకారం.. జనగామ (Jangaon) జిల్లా స్టేషన్ ఘనపూర్ గ్రామానికి చెందిన జంగిటి విజయలక్ష్మి, రమేష్ దంపతులకు తండ్రి రాజయ్య నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో చాలా ఏళ్ల క్రితమే బేసిమెంట్ వరకు నిర్మాణం చేపట్టారు. ఇటీవల ఇళ్లు నిర్మించుకోవాలని భావించిన దంపతులు పనులు మొదలు పెట్టగానే స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ అడ్డుకున్నారు. దీంతో చేసేందేం లేక ఇంటి పర్మిషన్ తీసుకునేందుకు గ్రామ పంచాయతీకి వెళ్లి సురేష్​ను కలిశారు.

  కన్నీళ్లతో ఇంటికి చేరిన విజయలక్ష్మి..

  అయితే ఇంటి పర్మిషన్ (House Permission) ఇచ్చేందుకు సురేష్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. కూలీ చేసుకునే తమ వద్ద అంత డబ్బు ఎక్కడ ఉంటుందని బతిమాలాడినా వినలేదు. అంతేకాకుండా మీరు భార్యాభర్తలు ఇద్దరెందుకు వస్తారు ఒక్కదానివి రావొచ్చుగా అంటూ కొంత అసభ్యకరంగా మాట్లాడారు. అయినా ఇంటి నిర్మాణ పర్మిషన్ రావాలని విజయలక్ష్మీ ధైర్యం చేసి ఒంటరిగా సర్పంచ్ సురేషను కలవడానికి పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. ఇంటి పర్మిషన్ ఇవ్వాలని విజయలక్ష్మి బతిమాలాడుతున్న క్రమంలోనే సురేష్ ఆమె చేయి పట్టి లాగాడు. దీంతో అతడి చేయి విడిపించుకుని కన్నీళ్లతో ఇంటికి చేరిన విజయలక్ష్మి ఇంట్లో ఉన్న వివిధ రకాల మాత్రాలు ఒకే సారి మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

  ఇంట్లో వాళ్లు చూసి వెంటనే విజయలక్ష్మిని కాపాడారు. దీంతో జరిగిన ఘటనను ఆమె మీడియాకు వెల్లడించింది. అయితే ఎమ్మెల్యే రాజయ్య సోదరుడు సర్పంచ్ సురేష్​పై మార్చి 28న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. చేసేందుకు దంపతులు ఇద్దరు వెళ్లారు. జనగామ డీసీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Sexual harrassment, Trs, Warangal

  తదుపరి వార్తలు