రూ.30 అడిగిందని తలాక్ చెప్పాడు.. మెడ పట్టి బయటకు గెంటేసి..

Triple Talaq: కేవలం రూ.30 కోసం ఓ మహిళకు తలాక్ చెప్పేశాడో భర్త. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 13, 2019, 11:22 AM IST
రూ.30 అడిగిందని తలాక్ చెప్పాడు.. మెడ పట్టి బయటకు గెంటేసి..
ప్రతీకాత్మక చిత్రం (photo-reauters
  • Share this:
ముస్లిం మహిళలకు రక్షణగా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చినా కొందరు మగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ట్రిపుల్ తలాక్ చెబితే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. ఆ భయం కూడా లేకుండా చిన్న చిన్న కారణాలకే భార్యలకు తలాక్ చెప్పేస్తున్నారు. తాజాగా, కేవలం రూ.30 కోసం ఓ మహిళకు తలాక్ చెప్పేశాడో భర్త. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాకు చెందిన మహిళకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, కొన్ని రోజుల కిందట ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో మందులు కొనుక్కొనేందుకు రూ.30 కావాలని భర్తను అడిగింది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ.. ఆమె భర్త ఆమెకు తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. అంతేకాదు.. తలాక్ చెప్పేశాను కదా.. ఇక నా ఇంట్లో ఉండేందుకు వీల్లేదని ఇంట్లోంచి మెడ పట్టి బయటలకు గెంటేశాడు.

దీంతో, బాధితులను తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆగస్టు 1 నుంచి ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>