విషాదం.. అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మహిళా కానిస్టేబుల్ మృతి

కృష్ణాజిల్లా కంచికచర్లలో ఎక్సైజ్ శాఖలో ఓ మహిళ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే ఆమె భర్త సైతం అదే కంచికచర్ల ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నాడు.

news18-telugu
Updated: May 30, 2020, 4:12 PM IST
విషాదం.. అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మహిళా కానిస్టేబుల్ మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ కోటి ఆశలతో కానిస్టేబుల్ కొలువును సాధించింది. ఆమె భర్త సైతం ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నాడు.ఏమైందో ఏమోగానీ అనుమానస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా కంచికచర్లలో ఎక్సైజ్ శాఖలో ఓ మహిళ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే ఆమె భర్త సైతం అదే కంచికచర్ల ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నాడు. కారణం ఏంటో తెలియదు గానీ శనివారం తన ఇంట్లో ఆ మహిళా కానిస్టేబుల్ అనుమానస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఎవరైనా హత్య చేసి ఇలా చిత్రీకరించి ఉంటారా అన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Published by: Narsimha Badhini
First published: May 30, 2020, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading