Home /News /crime /

A WOMAN COMMITTED SUICIDE IN NIZAMABAD AFTER LOSING HER LAND AS PART OF A GOVERNMENT PROJECT NZB PRV

Nizamabad: అయ్యో .. ప్రాజెక్టు పనుల్లో భాగంగా తమ భూములు పోతున్నాయనే ఆందోళనతో ఆ ఇల్లాలు ఎంతటి పని చేసిందో తెలుసా..?           

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

ప్రాజెక్టుకు భూములే కాదు ఊళ్లు.. ఊళ్లే ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా పుట్టి పెరిగిన ప్రాంతం వదిలి వెళ్లాలంటే ఎవరికి మనుసు ఒప్పుతుంది చెప్పండి. అలాంటి కథే మన నిజామాబాద్​లోది.

  లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించే ఉద్ధేశంతో ప్రభుత్వాలు ప్రాజెక్టులు (Projects) కడతాయి. వాటికోసం ఆయా ప్రాంతాల్లో భూములు సేకరిస్తాయి. దీంట్లో భాగంగా వేలాది ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది రైతులు. ఒకవేళ ఒప్పుకోకపోయినా ఏదో ఒక జీవో జారీ చేసి తీసుకుంటారు. ఈ వ్యవహారంలోకి రాజకీయ నాయకులు వస్తేనే గొడవ మరో విధంగా మారుతుంది. దీంతో ప్రాజెక్టు పనులు నెమ్మదిస్తాయి. వెరసి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే భూములు ఇచ్చే రైతుల బాధలు మరో ఎత్తు. ప్రాజెక్టుకు భూములే కాదు ఊళ్లు.. ఊళ్లే ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా పుట్టి పెరిగిన ప్రాంతం వదిలి వెళ్లాలంటే ఎవరికి మనుసు ఒప్పుతుంది చెప్పండి. అలాంటి కథే మన నిజామాబాద్​లోది.

  కాళేశ్వ‌రం ప్యాకేజీ 22 ప‌నులు (Kaleswaram Package 22 pins) నిలిపివేయాని గ‌త కొద్ది రోజులుగా ఆ చుట్టు ప‌క్క‌ల గ్రామాల వారు ఆందోళ‌న‌లు చేశారు. దీంతో తాత్కాలికంగా ఆ ప‌నుల‌ను నిలిపివేశారు అధికారులు. అయితే పోలీసు ప్ర‌హ‌రిలో ప‌నులు జ‌ర‌గ‌డంతో త‌మ భూములు పోవ‌డం ఖాయ‌మ‌ని  ఆందోళ‌న చెందిన ఓ మ‌హిళ చెట్టుకు ఉరి వేసుకుని అత్మ‌హ‌త్య  (Woman Suicide)చేసుకుంది. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో జ‌రిగింది.

  రీడిజైన్​ పేరుతో 3.5 టీఎంసీలకు..

  నిజామాబాద్ (Nizamabad) జిల్లా మోపాల్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన భూములు కాళేశ్వరం ప్యాకేజీ 22 కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. అమ్రాద్ గ్రామం లో గడ్కోల్ పంపు హౌస్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ప్యాకేజీ 22 లో కొండెం చెరువు రిజర్వాయర్ ను 1.5 టీఎంసీ ల సామర్థ్యం నుంచి రీడిజైన్​ పేరుతో 3.5 టీఎంసీ లకు పెంచారు. దీనిని ఇటీవల  మంచిప్ప, అమ్రాద్ గ్రామంతో పాటు చుట్టు ప్రక్కల 8 తండా లకు చెందిన ప్రజలు వ్యతిరేకించారు.

  రిజర్వాయర్ పెంచితే  చుట్టు ప‌క్క‌ల గ్రామాల‌కు ముప్పు ఉంది. దీంతో  2 వేల మంది ప్రజలు నిర్వాసితులు అవుతారు.  14 వేల ఎకరాల భూమి ప్రాజెక్టు నీటిలో మునిగిపోతుంది. దీంతో రెండు గ్రామాలు, 8 తండాల ప్రజలు రీడిజైన్ వద్దని గ‌త కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

  మా తాతల నాటి నుంచి ఉంటున్న ఇళ్లను.. భూముల‌ను ఎలా వ‌దులుకోవాల‌ని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి ఏలాంటి హామి రైతుల‌కు రాలేదు. ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గ‌డంతో అమ్రాద్ తండాకు చెందిన‌ బుజ్జి బాయ్ (55) అనే మహిళ భూములు కూడా పోతాయ‌ని ఆందోళ‌న చెంది ఉరి వేసుకుని ఆత్మ‌హత్యకు పాల్పడింది. దీంతో స్థానిక తండా వాసులు, బాధిత గ్రామాల ప్ర‌జ‌లు ఆ మ‌హిళ‌ శవాన్ని తీసుకువచ్చి ప‌నుల‌ను నిలిపి వేయాల‌ని ఆందోళ‌న‌కు దిగారు.  పనులకు ఆటంకం క‌లిగించారు.  పోలీసులు సంఘ‌ట‌న స్థలానికి చేరుకుని ప‌రిస్థితి స‌మీక్షించారు. ఏలాంటి అవాంచానీయ సంఘ‌ట‌న‌లు జ‌రగ‌కుండా  బందోబస్తు ఏర్పాటు చేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Kaleswaram Project, Nizamabad, Project, Women died

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు