భార్యాభర్తల బంధంలో ఒకరికి తెలియకుండా ఒకరు సర్ప్రైజ్లు ప్లాన్ చేయడం సహజం. అది గిఫ్ట్ కావొచ్చు లేదా ఎక్కడికైనా వెళ్లే ట్రిప్ కావొచ్చు. బాగా రిచ్ అయితే బర్త్ డేకు సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఫ్లాట్ బుక్ చేసి ఆ విషయాన్ని చెప్పే జీవిత భాగస్వామి కూడా ఉంటారు.
జైపూర్: భార్యాభర్తల బంధంలో ఒకరికి తెలియకుండా ఒకరు సర్ప్రైజ్లు ప్లాన్ చేయడం సహజం. అది గిఫ్ట్ కావొచ్చు లేదా ఎక్కడికైనా వెళ్లే ట్రిప్ కావొచ్చు. బాగా రిచ్ అయితే బర్త్ డేకు సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఫ్లాట్ బుక్ చేసి ఆ విషయాన్ని చెప్పే జీవిత భాగస్వామి కూడా ఉంటారు. అలా తన భర్త బర్త్‌డేకు రాజస్థాన్‌కు చెందిన ఓ వివాహిత సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఫ్లాట్ ప్లాన్ చేసింది. కానీ.. భర్తను సర్ప్రైజ్ చేద్దామని భావించిన ఆ భార్యకు మోసగాళ్లు ఊహించని షాకిచ్చారు. రూ.9 లక్షల వరకూ డబ్బు కట్టించుకుని డాక్యుమెంట్లు అడిగితే రేపుమాపంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా.. గట్టిగా నిలదీసినందుకు ‘మాతో పెట్టుకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తాం’ అని మహిళను బెదిరించారు. చివరకు ఏతావాతా తెలిసిందేంటంటే.. అసలు సదరు వ్యక్తి ఆ మహిళ పేరు మీద ఫ్లాటే బుక్ చేయలేదు. ఆమెను ఫ్లాట్ పేరుతో డబ్బు కట్టించుకుని మోసం చేశాడు. సదరు వివాహిత ఫిర్యాదుతో పోలీసులు మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.