వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

ప్రతీకాత్మక చిత్రం

కృష్ణ తన ఆటోను ఇదే గ్రామానికి చెందిన గుంటి బాల్‌రాజ్‌కు విక్రయించాడు. స్నేహం పేరుతో బాల్‌రాజ్‌కు తరచూ క‌ృష్ణ ఇంటికి వస్తూపోతుండేవాడు. ఈ క్రమంలో లక్ష్మితో బాల్‌రాజ్‌కు వివాహేతర సంబంధానికి దారి తీసింది.

 • Share this:
  ఓ మహిళ భర్త ఉన్నప్పటికీ అడ్డదారి తొక్కింది. అంతటితో ఆగకుండా తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ ఘటన ఈనెల 8న మేడ్చల్ జరిగింది. ఈ హత్య కేసు వివరాలను మేడ్చల్ సీఐ తాజాగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామపంచాయతీ అక్బార్జాపేటకు చెందిన మహంకాళి కృష్ణ(36), లక్ష్మీ దంపతులు. వీరికి సంతానం లేదు. కృష్ణ స్థానికంగా వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2014లో కృష్ణ తన ఆటోను ఇదే గ్రామానికి చెందిన గుంటి బాల్‌రాజ్‌కు విక్రయించాడు.

  ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే బాల్‌రాజ్‌కు తరచూ క‌ృష్ణ ఇంటికి వస్తూపోతుండేవాడు. ఈ క్రమంలో లక్ష్మితో బాల్‌రాజ్‌కు వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి అక్రమ సంబంధ విషయం ఎనిమిది నెలల క్రితం క‌ృష్ణకు తెలిసింది. కృష్ణ, లక్ష్మీలకు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన భర్తను చంపాలనుకుంది. అందులో భాగంగానే లక్ష్మీ పలుమార్లు కృష్ణకు నిద్రమాత్రలు ఇచ్చింది.

  ఎలాగోలా బతికి బయటపడ్డ కృష్ణ ఈనెల 8వ తేదీన రాత్రి ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఇదే అదునుగా లక్ష్మీ తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. ఇంతలోపే కృష్ణకు మెళకువ వచ్చింది. ప్రియుడితో ఉన్న భార్యను చూసి బయటకు పరిగెడుతుండగా, వారిద్దరూ కలిసి ఇస్త్రీ పెట్టె తీగను భర్త కృష్ణ మెడకు బిగించి దారుణం హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచరాణ చేపట్టారు. హత్య విషయం బయటపడడంతో లక్ష్మీ, బాల్‌రాజ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
  Published by:Narsimha Badhini
  First published: