13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపిన భార్య... ప్రియుడితో కలిసి దారుణంగా...

తన సంబంధానికి అడ్డుగా మారిన భర్తను చంపేయాలని ప్లాన్ వేసిన భార్య... కూతురికి మాయమాటలు చెప్పి తండ్రి హత్యకు పథకం... తల్లి మాటలు నమ్మి, తండ్రి హత్యకు సహకరించిన బాలిక... చికెన్‌లో విషం కలిపి, ఆ తర్వాత గొంతుకు ఉరి వేసి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 20, 2019, 7:54 PM IST
13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపిన భార్య... ప్రియుడితో కలిసి దారుణంగా...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 20, 2019, 7:54 PM IST
కట్టుకున్న భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందామె. ఆ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలనుకుంది. పథకం పన్నింది. దానికి సొంత కూతురి సహకారం కోరింది. తల్లి మాటలు నమ్మిన ఆ చిన్నారి... తండ్రిని చంపేందుకు సహకరించింది. విషయం తెలియని అతను... తల్లికూతుర్లు ప్రేమగా పెట్టిన చికెన్ తిని, చనిపోయాడు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన 40 ఏళ్ల వసంత్... చాలా ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. కుటుంబంతో కలిసి కీసర ఏరియాలో ఉన్న రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉంటున్నాడు. వసంత్ ఓ టెంట్‌హౌస్‌లో పనిచేస్తుండగా, అతని భార్య రేణుక ఓ గ్యాస్ కంపెనీలో పని చేస్తోంది. వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే గ్యాస్ కంపెనీలో పనిచేసే కిషోర్ అనే యువకుడితో రేణుకకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కాలనీలోని ఓ గదిని అద్దెకు తీసుకుంటూ, అందులో ఎవ్వరికీ తెలియకుండా శారీరక సంబంధం కొనసాగించేవారు. అయితే ఈ విషయం తెలిసిన వసంత్... భార్యను మందలించాడు.

పద్ధతి మార్చుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. దాంతో తన సంబంధానికి అడ్డుగా మారిన భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది రేణుక. అందుకు 13 ఏళ్ల పెద్ద కూతురు సహకారం కోరింది. కిషోర్‌తో కలిసి ఉంటే... ఫుల్లుగా ఎంజాయ్ చేయవచ్చని మాయమాటలు చెప్పింది. తల్లి మాటలు నమ్మిన ఆ బాలిక... తండ్రిని చంపేందుకు అంగీకరించింది. ఇద్దరూ పథకం ప్రకారం చికెన్‌లో ఎలుకల మందు కలిపారు. ఎవ్వరూ తినకుండా తండ్రికి మాత్రమే పెట్టారు. విషయం తెలియని వసంత్...ఆ చికెన్‌ను తిని స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో ప్రియుడు కిషోర్‌ను ఇంటికి పిలిపించిన రేణుక... కూతురితో కలిసి భర్తకు చున్నీతో ఉరి వేసి చంపేశారు. తర్వాత విషం కలిపిన చికెన్‌ను బయట పడేశారు. ఫుల్లుగా తాగి వచ్చి, గుండె ఆగి చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహంపై ఉన్న గాయలతో పాటు, బయట పాడేసిన చికెన్‌ను తిని ఓ కుక్క చనిపోవడానని చూసి బంధువులకు అనుమానం వచ్చింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టమ్ చేయించారు. రిపోర్ట్‌లో విషం పెట్టి, ఉరి వేసి చంపినట్టుగా తేలింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... రేణుక, అతని ప్రియుడు కిషోర్‌లను అదుపులోకి తీసుకున్నారు.

First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...