మానవత్వం మంట కలిసిపోతుంది.. దాంపత్యాలు కూలుతున్నాయి. వివాహేతర సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు,అనుబంధాలు, రాగాలు, అనురాగాలు మంటగలసి పోతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వేలం వెర్రిగా బయటపడుతున్నాయి. అన్నింట్లోనూ వివాహేతర సంబంధాలదే ప్రధాన భూమికగా మారింది. తాత్కాలిక సంతోషం, సుఖం కోసం ఎంతో మంది వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినప్పటికీ దాని ఫలితాలు, పర్యవసానాలు ఎన్నో జీవితాలతో ముడిపడి ఉంటాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు. కొన్ని నిమిషాల ఆనందం కోసం జీవితాన్ని, కుటుంబాన్నే పనంగా పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఒకటి... రెండు కాదు.. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు జరిగాయి. వీటివల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.చక్కగా చూసుకునే భర్తను ఇంట్లో పెట్టుకుని పక్కచూపులు చూసింది. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని.. చివరికి కట్టుకున్న మొగుడిని (Wife killed Husband) కాటికి పంపిందో వివాహిత. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా (Asifabad) ఇటుకల పహాడ్‌లో ఈ దారుణం జరిగింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన దేవేందర్ , పార్వతి భార్యాభర్తలు. కూలి పనుల కోసం ఇక్కడికి వలస వచ్చారు. వీరితో పాటు రామ్ లాల్ అనే మరో వ్యక్తి కూడా వచ్చాడు. అయితే పార్వతి.. రామ్‌లాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ ఏకాంతంగా వున్న సమయంలో భర్త చూసి నిలదీశాడు. దీంతో ఇద్దరు కలిసి దేవేందర్‌ను హత్య చేసి పాతిపెట్టారు. తర్వాత తాగిన మైకంలో తోటి కూలీలతో రామ్ లాల్ అసలు విషయం చెప్పడంతో ఘోరం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు పాతిపెట్టిన దేవేందర్ మృతదేహాన్ని బయటకు తీశారు. వీరిద్దరికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.
ఏపీలో ఇలాంటి ఘటనే..
ఇటీవలె ఏపీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శంకర్ రెడ్డి, ఢిల్లీ రాణి (27) దంపతులు బెంగళూరులోని యశ్వంత్‌పూర్ ఏరియాలో ఉంటున్నారు. ఏడేళ్ల వయస్సు ఉన్న ఒక కుమారుడు ఉన్నారు. శంకర్ రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే గురువారం అర్ధరాత్రి పిల్లవాడు నిద్ర లేచి చూసేసరికి తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాడు. దీంతో ఏం చేయాలో తోచని బాలుడు సహాయం కింద పోర్షన్ లో ఉంటున్న ఇంటి యజమాని తలుపు తట్టి విషయం చెప్పాడు. వెంటనే ఇంటి యజమాని స్థానికులతో సహాయంతో భార్యా,భర్తలు ఇద్దరినీ హాస్పిటల్ కి తరలించగా, అక్కడ శంకర్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
రాణి చేతికి గాయాలు తగిలాయ్యాయని అధికారులు తెలిపారు. రాణికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత.. గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి తనపై, తన భర్తపై కత్తితో దాడి చేసి బంగారు గొలుసు తీసుకుని పారిపోయారని పోలీసులకు కంప్లెయింట్ చేసింది రాణి. అయితే, పోలీసులు ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలను కోరినప్పుడు, రాణి యొక్క వాంగ్మూలాలు పొంతన లేనివిగా గుర్తించారు.
చైన్ దొరకడంతో..
కాగా, పోయిందన్న చైన్ ను బట్టల్లో ఆమె దాచినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో రాణిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లోకి బలవంతంగా ఇతరులు ప్రవేశించే అవకాశం లేకపోవడంతో ఆమెపై అనుమానం మరింత పెరిగింది. చివరకు రాణి మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. దీంతో ఏపీలోని సొంతూరులో ఒక వ్యక్తితో ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం విషయం బయటపడింది. దీంతో రాణిని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో ప్రియుడితో కలిసి జీవించేందు భర్త అడ్డుగా ఉన్నాడని,దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి దోపిడీ ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు ఒప్పకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Crime news, Extra marital affair, Wife kills husband