ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపిన భార్య... తర్వాత

పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్న జంట కాపురంలో చిచ్చు పెట్టిన వివాహేతర సంబంధం... భర్త పనిచేసే యజమానితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య... విషయం తెలిసి తాగుడుకి బానిస అయిన భర్త... తాగి వచ్చి వేధిస్తున్నాడని పథకం పన్ని...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 15, 2019, 3:22 AM IST
ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపిన భార్య... తర్వాత
నమూనా చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెళ్లి కుదిర్చిన వివాహంతో ఒక్కటైన దంపతులైనా మరో వ్యక్తి రాకతో పచ్చని కాపురాల్లో చిచ్చు రేగుతోంది. క్షణికావేశంతో కొందరు, మరో వ్యక్తి మీద మోజుతో మరికొందరు ఎదుటివారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ సంఘటన వెలుగుచూసింది. పెళ్లి సమయంలో కలకాలం తోడుగా ఉంటానని చెబుతూ భర్త పసుపు తాడు కడితే... భార్య మరో వ్యక్తి మోజులో పడి అతనికి ఉరి తాడు బిగించింది. వనపర్తి జిల్లా కొత్తకోట ఏరియాలోని గోపన్నపేట గ్రామానికి చెందిన అంజనేయులు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బతుకుతెరువు కోసం ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్లిన అతనికి 2009లో సుహాసిని అనే అమ్మాయితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి... పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే ఆంజనేయులు డ్రైవర్‌గా పనిచేసే టిప్పర్ లారీ ఓనర్ రమేశ్‌తో సుహాసినికి పరిచయం ఏర్పడింది. ఖర్చులకు అడిగినంత డబ్బులు ఇస్తూ, ఆమెతో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు రమేశ్. ఈ విషయం తెలిసిన ఆంజనేయులు... తాగుడుకు బానిస అయ్యాడు. నిత్యం తాగి వస్తూ భార్యను వేధించేవాడు. దాంతో అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని ఫిక్స్ అయ్యింది సుహాసిని. ప్రియుడు రమేశ్‌తో కలిసి ఆంజనేయులిని చంపేందుకు పథకం పన్నింది. పక్కా ప్లానింగ్ ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంజనేయులు ఇంటికి వెళ్లాడు రమేశ్. సుహాసినీ, రమేశ్ కలిసి టవల్‌తో ఆంజనేయులు గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టు పడుకుంది సుహాసిని. తర్వాతి రోజు సాయంత్రం ప్రియుని కారులోనే భర్త శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లింద. పుల్లుగా కల్లుతాగి కిందపడి చనిపోయాడని కుటుంబసభ్యులను నమ్మించింది. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసిన తర్వాత ఆంజనేయులు మెడ చుట్టూ గాయలు ఉండడంతో అనుమానం వచ్చిన అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... శవాన్ని గమనించి, హత్యగా నిర్ధారించారు. భార్య సుహాసినిని అదుపులోక తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సుహాసినినీ, ఆమె ప్రియుడు రమేశ్‌ను అరెస్ట్ చేశారు. భార్య ఆ సంబంధం వల్ల ముగ్గురు పిల్లలు అనాథలు మిగిలారు.

First published: March 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading