నూరేళ్ల జీవితం ఊహించుకొని పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లయ్యాక భాగస్వామితో గొడవలు ఆ జీవితాలనే మలుపులు తిప్పుతాయి. అప్పటి వరకు కలలు కన్న సౌధం ఒక్కసారిగా కూలిపోతుంది. ఇలాంటి ఘటనే కరీంనగర్ (Karimnagar)లో జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన కె రమేష్‌కు మంచిర్యాల జిల్లాకు చెందిన వంగ భారతికి గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. భారతి స్త్రీ వైద్య నిపుణురాలు కాగా.. రమేష్ పిల్లల డాక్టర్. వీరు గత ఆరు నెలలుగా సుర్యోదయ నగర్లో నివాసం ఉంటున్నారు. పెళ్లైనా (After marriage) తర్వాత కొన్ని నెలల పాటు వీరి జీవితం బాగానే సాగింది. అయితే ఇటీవల భారతిని భర్త రమేశ్‌కు గొడవలు మొదలయ్యాయి. ఇద్దరం కలిసి హాస్పిటల్ పెడదామని.. ఇందుకోసం అదనపు కట్నం తీసుకురావాలని భారతిని రమేష్ (ramesh) ఒత్తిడి చేశాడు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా.. మద్యం తాగొచ్చి హింసించేవాడు. ఈ క్రమంలోనే భారతి (Bharati) 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. అయితే పెద్దలు సర్దిచెప్పడంతో వారం క్రితం తిరిగి భర్త వద్దకు వచ్చింది.
శుక్రవారం రాత్రి భారతి తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు అల్లుడు రమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో రమేష్ తాను ఆసుపత్రిలో ఉన్నానని.. ఇంటికి వెళ్లి చెబుతునానని అన్నాడు. ఆ తర్వాత రమేష్.. భారతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని (Suicide) చెప్పాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు అక్కడకు చేరుకని వివరాలు సేకరించారు. భారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
రమేశ్ వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని భారతి తండ్రి శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్(Hyderabad) కూకట్పల్లి(Kukatpalli)లో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla)జిల్లాకు చెందిన జూపల్లి శ్రీనివాసరావు (Jupally Srinivasa Rao)ఫ్యామిలీ చాలా రోజుల క్రితమే హైదరాబాద్‌లో సెటిలైంది. ప్రైవేట్ జాబ్ చేస్తున్న శ్రీనివాసరావు తన పెద్ద కుమార్తె నిఖిత (Nikhita)ను సిరిసిల్ల టౌన్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చేటి ఉదయ్‌కుమార్(Udayakumar)కి ఇచ్చి గ్రాండ్‌గా మ్యారేజ్(Marriage)చేశారు. పెళ్లైన కొద్ది రోజులకే నిఖితను భర్త ఉదయ్ సిరిసిల్లలో ఉన్న 4.25ఎకరాల భూమిలో సగం తన పేరుతో రాయించాలని పట్టుబట్టాడు. అల్లుడి పోరు భరించలేకపోయి మరో 10 లక్షలు ఇచ్చాడు. అయినప్పటికి తీరు మారలేదు సరికదా టార్చర్ మరింత పెరిగింది. మెట్టినింట్లో పరిస్థితి ఈ విధంగా ఉండటంతో నిఖిత ఉగాది రోజున కూకట్‌పల్లిలో ఉంటున్న తల్లిదండ్రులకు దగ్గరకు వచ్చింది.
అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తున్న ఉదయ్ ఈనెల 20న సిరిసిల్ల నుంచి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని బాలకృష్ణనగర్‌లో ఉంటున్న నిఖిత పేరెంట్స్ ఇంటికి వచ్చాడు. భార్య, అత్త,మామలతో గొడవపడ్డాడు. అదే సమయంలో నిఖిత మెడలో మంగళసూత్రం తెంచి కొట్టాడని తెలుస్తోంది. అదనపు కట్నం కోసం భర్త తనను కొట్టడం తల్లిదండ్రుల పరువు తీయడంతో నిఖిత తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే రోజు రాత్రి తన బెడ్రూమ్లోని ఫ్యాన్‌కి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Dowry harassment, Telangana crime news, Wife suicide