లవర్‌తో అడ్డంగా దొరికిన మహిళ.. కొడుకులిద్దరు కలిసి ఆమెను..

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో జోదా గ్రామానికి చెందిన మహిళ (45) ఓ దూరపు బంధువు (35)తో సంబంధం పెట్టుకుంది. వారిద్దరు కలిసి 10 రోజుల క్రితం ఇంట్లోంచి పారిపోయారు.

news18-telugu
Updated: September 18, 2019, 6:15 PM IST
లవర్‌తో అడ్డంగా దొరికిన మహిళ.. కొడుకులిద్దరు కలిసి ఆమెను..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహిళ వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆమె కొడుకులు ఇద్దరు కలిసి ఆమెను నడిరోడ్డుపై చితకబాది, జుట్టు కత్తిరించారు. అంతేకాదు.. ఆమె లవర్ మూత్రాన్ని తాగించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి నింబి జోదా గ్రామానికి చెందిన మహిళ (45) ఓ దూరపు బంధువు (35)తో సంబంధం పెట్టుకుంది. వారిద్దరు కలిసి 10 రోజుల క్రితం ఇంట్లోంచి పారిపోయారు. అది తెలిసిన ఆమె కొడుకులు, బంధువులు గాలించగా ఓ చోట కనిపించారు. వారిద్దర్ని అక్కడే దారుణంగా చితకబాది, నాలుగు రోజుల ఊళ్లోకి తీసుకొచ్చారు. ఊరి మధ్యలో వారిద్దర్ని కట్టేసిన మహిళ కుమారులు.. వారిద్దరి జుట్టు కత్తిరించారు. ఆ తర్వాత ఆమెతో లవర్ మూత్రాన్ని తాగించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయగా క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

ఆ వీడియో జిల్లా పోలీసులకు చేరడంతో.. వెంటనే బాధితురాలిని పరామర్శించి, ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదుతో కొడుకులిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితులకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసినట్లు ఆ జిల్లా ఏఎస్పీ నితేశ్ ఆర్యా వెల్లడించారు.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading