హోమ్ /వార్తలు /క్రైమ్ /

కాళ్ల పారాణి ఆరకముందే.. భర్త ఊపిరిని ఆర్పేసిన భార్య.. పెళ్లైన వారం రోజుల్లోనే హత్య

కాళ్ల పారాణి ఆరకముందే.. భర్త ఊపిరిని ఆర్పేసిన భార్య.. పెళ్లైన వారం రోజుల్లోనే హత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా పెళ్లి చేసుకునే జంట... పార్వతీ పరమేశ్వరుడిలా ఉన్నారని కీర్తిస్తారు. ఆ జంట చూడ ముచ్చటగా ఉందని.. కలకాలం కలిసి ఉంటారని భావిస్తారు. బీహార్ లో ఓ జంటను కూడా అలాగే అనుకున్నారు పెళ్లికి వచ్చిన బంధువులు. కానీ వారికి తెలియదు ఈ నవ వధువే ఆమె భర్త ప్రాణాలు తీస్తుందని..

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

పెళ్లిల్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. కొత్తగా పెళ్లి చేసుకునే జంట... పార్వతీ పరమేశ్వరుడిలా ఉన్నారని కీర్తిస్తారు పెళ్లికి వచ్చిన వారు. ఆ జంట చూడ ముచ్చటగా ఉందని.. కలకాలం కలిసి ఉంటారని భావిస్తారు. బీహార్ లో ఓ జంటను కూడా అలాగే అనుకున్నారు పెళ్లికి వచ్చిన బంధువులు. కానీ వారికి తెలియదు ఈ నవ వధువే ఆమె భర్త ప్రాణాలు తీస్తుందని.. అది కూడా ఏ ఐదేళ్లకో.. పదేళ్లకో కాదు. పెళ్లైన వారం రోజులకే. అవును..! పెళ్లై కనీసం పది రోజులు కూడా కాకముందే తన భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

బీహార్ లోని పశ్చిమ చంపారన్ లో వెలుగుచూసింది ఈ ఘటన. జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన శ్యామ్జీ సా దినసరి కూలి. అతడి కుటుంబమంతా రోజూవారీ పని చేసుకుని బతికేవాళ్లే. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. శ్యామ్జీ కి ఇటీవలే పెళ్లైంది. ఈనెల 13న అతడికి.. అదే జిల్లాలోని మరో మారుమూల గ్రామ నివాసి అయిన గ్రితి దేవిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లై.. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

నిన్న (ఆదివారం) రాత్రి పూట శ్యామ్జీ ఇంటి వాళ్లు తాము నమ్మలేని ఘటనను చూశారు. అతడి గదిలో విగతజీవిగా పడిఉన్న శ్యామ్జీ. అతడి గొంతు తెగి ఉంది. రక్తం ధారగా పోతుంది. గది నిండా రక్తం. అత్యంత భీతిగొలిపేలా ఉందా దృశ్యం. వాళ్లకు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. బాధితుడి కుటుంబ సభ్యులు.. అతడున్న గదికి చేరుకోగానే.. గ్రితి అక్కడ్నుంచి పారిపోవడానికి యత్నించింది.

ఇదీ చదవండి.. అంధుడైన కొడుకుకు పింఛన్ ఇప్పించమంటే పక్కలో పడుకోమన్నాడు.. అధికార పార్టీ నాయకుడి బాగోతం

వారం రోజులు గడవకముందే భర్తను చంపడానికి గల కారణాలేంటో గ్రితి ఇంకా వెల్లడించలేదు. అయితే.. ఇదే విషయంపై పోలీసులు గ్రితిని విచారిస్తుంటే.. ఆమె మరో విధంగా చెబుతున్నది. తాను ఈ హత్య చేయలేదని ఆమె అంటున్నది. అర్థరాత్రి పూట ఎవరో తలుపు కొడితే తీశానని.. గడియ తీసినాక ఇద్దరు వ్యక్తులు వచ్చి తన మూతికి మూర్ఛ పోయే గుడ్డను ఉంచారని.. దాంతో తాను స్పృహ తప్పి పడిపోయానని.. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని వాపోయింది. కానీ శ్యామ్జీ కుటుంబసభ్యులు మాత్రం... గ్రితి దేవినే అతడిని చంపిందని.. చంపిన తర్వాత పారిపోతుండగానే తాము పట్టుకున్నామని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నది. గ్రితిది తమకు దగ్గరి ఊరు కాదని.. ఆమె తాము ఉంటున్న ఊరు నుంచి చాలా దూరం ఉండటంతో గ్రితి ఎలాంటిది..? భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందనే దాని మీద తమకు ఏ మాత్రం అవగాహన లేదని కుటుంబసభ్యులు అంటున్నారు.

First published:

Tags: Bihar, Crime, Crime news, Murder, Wedding, Wife kill husband

ఉత్తమ కథలు