A VOLUNTEER WHO RUDE TO WOMEN SI IN NELLORE ANDHRA PRADESH BN
షాకింగ్.. మహిళా ఎస్ఐ అని చూడకుండా వాలంటీరు ఎంత పనిచేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
మద్యం సేవించి ఆత్మకూరు 21వ వార్డు వాలంటీరు అటుగా వచ్చాడు. దీంతో పోలీసు సిబ్బందిని ఆ వాలంటీరును ఆపారు. దీంతో రెచ్చిపోయిన వాలంటీరు ఎస్ఐను దుర్భాషలాడుతూ నానా రచ్చ చేశాడు.
పోలీసు.. ఈ పేరు వింటేనే కొంతమందిలో వణుకుపుడుతుంది. చాలామంది పోలీసు అనగానే కాస్తంతైనా భయపడుతుంటారు. చాలామంది పోలీసులు సైతం అదే స్థాయిలో ప్రవర్తిస్తుంటారు. మాములు ప్రజలపై తమ ప్రతాపం చూపుతుంటారు. కానీ ఓ మహిళా ఎస్ఐకు విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. పూటుగా మద్యం తాగిన ఓ వాలంటీరు ఆమెకు చుక్కలు చూపించాడు. మద్యం మత్తులో ఆమె ఎస్ఐ అయితే నాకేంటి అన్నంతగా రెచ్చిపోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్ఐ రోజాలత పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. అయితే మద్యం సేవించి ఆత్మకూరు 21వ వార్డు వాలంటీరు అటుగా వచ్చాడు. దీంతో పోలీసు సిబ్బందిని ఆ వాలంటీరును ఆపారు. దీంతో రెచ్చిపోయిన వాలంటీరు ఎస్ఐను దుర్భాషలాడుతూ నానా రచ్చ చేశాడు.
ఎస్ఐ అని చూడాకుండా నడిరోడ్డుపై చొక్కా విప్పి వీరంగం సృష్టించారు. తిట్ల పురాణం అందుకుని అంతు చూస్తానంటూ బెదిరించాడు. అతడికి తోడు మరో వాలంటీరు భర్త సైతం ఉన్నాడు. వీరిద్దరిపై పాపారావు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆ తర్వాతి రోజే సీఐ బదిలీ కావడం చర్చనీయాంశం అయ్యింది.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.