పేషెంట్లకు అవసరం లేకున్నా ఆపరేషన్లు.. డాక్టర్‌కు 465 ఏళ్ల జైలు శిక్ష

వైద్యం పేరుతో పేషెంట్ల నుంచి భారీగా డబ్బులు గుంజిన ఓ డాక్టర్‌కు తగిన శిక్ష పడింది. తన వద్దకు వచ్చిన చాలా మందికి పేషెంట్లకు అవసరం లేకపోయినప్పటికీ ఆపరేషన్లు చేసిన డాక్టరుకు కోర్టు 465 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

news18-telugu
Updated: November 15, 2020, 8:01 PM IST
పేషెంట్లకు అవసరం లేకున్నా ఆపరేషన్లు.. డాక్టర్‌కు 465 ఏళ్ల జైలు శిక్ష
జావైద్ పెర్వైజ్(ఫొటో-Twitter)
  • Share this:
వైద్యం పేరుతో పేషెంట్ల నుంచి భారీగా డబ్బులు గుంజిన ఓ డాక్టర్‌కు తగిన శిక్ష పడింది. తన వద్దకు వచ్చిన చాలా మందికి పేషెంట్లకు అవసరం లేకపోయినప్పటికీ ఆపరేషన్లు చేసిన డాక్టరుకు కోర్టు 465 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటుచేసుకుంది. వివరాలు.. వర్జీనియాలోని చెసాపీక్‌కు చెందిన జావైద్ పెర్వైజ్ అనే గైనకాలజిస్టు డబ్బుకు ఆశపడి తన వద్దకు వచ్చే పేషెంట్లకు వారి సమస్యలను పెద్దగా చూపించేవాడు. ఇలా వారిని నమ్మించి అనవసరమైన ఆపరేషన్స్ చేసేవాడు. ఇలా చేయడం ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి మిలియన్ డాలర్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. దాదాపు 52 మంది పేషెంట్లకు అవసరం లేకున్నా.. శస్త్రచికిత్సలు చేశాడు. అందులో చాలా వరకు గర్భాశయ శస్త్రచికిత్సలు ఉన్నాయి. 2010 నుంచి అతను ఈ చర్యలకు పాల్పడుతన్నట్టుగా ఈ కేసును విచారిస్తున్న అధికారులు భావిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా గర్బిణీలకు ముందుగానే ఆపరేషన్ చేయించుకునేలా జావైద్ ప్రేరేపించేవాడని అధికారులు గుర్తించారు. అలాగే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు ఆపరేషన్లు అవసరమని జావైద్ కొన్నిసార్లు పేషెంట్లను నమ్మించాడని అధికారులు తెలిపారు. పలువురు మహిళలు జావైద్ తమకు అనవసరమైన సర్జరీలు చేశారని చెప్పినప్పటికీ.. కోర్టులో 29 కేసులకు సంబంధించిన వివరాలు అందించబడ్డాయి.

1984లోనే జావైద్ మెడికల్ లైసెస్స్ రద్దు చేయబడిందని, అతడు 1995 ట్యాక్స్ ఫ్రాడ్ కేసులో దోషిగా తేలడాలని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. అయితే ఆ తర్వాత అతడు తన లైసెన్స్ తిరిగి పొందాడని చెప్పింది. ఈ కేసు సంబంధించి అన్ని వివరాలు పరిశీలంచిన ఫెడరల్ జ్యూరీ.. అతనికి 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక, పదేళ్ల కాలంలో పర్వేజ్ 41.26 శాతం ఆపరేషన్లు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సాధారణంగా ఆ వ్యవధిలో డాక్టర్లు 7.63 శాతం మంది పేషెంట్లకు మాత్రమే సర్జరీలు చేస్తారని నిపుణులు చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: November 15, 2020, 8:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading