Female Constable: వామ్మో.. ఈ లేడీ కానిస్టేబుల్ ఎంత కిలాడీనో చూడండి.. పట్టపగలు.. పోలీస్ స్టేషన్‌లోనే..

మహిళా కానిస్టేబుల్ రీనా

మన దేశంలో లంచం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఈ సంగతి తెలిసినా ఇప్పటికీ చాలాచోట్ల లంచం ఇవ్వడానికి, తీసుకోవడానికి కొందరు ఏమాత్రం వెనుకాడటం లేదు. మనల్ని ఎవరు చూస్తున్నారనే ధైర్యంతో కింది స్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ చాలామంది లంచాలకు అలవాటుపడుతున్నారు.

  • Share this:
    బారాబంకి: మన దేశంలో లంచం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఈ సంగతి తెలిసినా ఇప్పటికీ చాలాచోట్ల లంచం ఇవ్వడానికి, తీసుకోవడానికి కొందరు ఏమాత్రం వెనుకాడటం లేదు. మనల్ని ఎవరు చూస్తున్నారనే ధైర్యంతో కింది స్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ చాలామంది లంచాలకు అలవాటుపడుతున్నారు. పోలీసు వ్యవస్థలో కూడా కొందరు ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ పాస్‌పోర్ట్ వెరికేషన్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది.

    ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని బారాబంకి జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ దొరికిపోయింది.

    ఈ ఘటనకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి

    బారాబంకి జిల్లా దేవా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రీనా అనే యువతి లంచం తీసుకుంటుండగా ఎవరో ఈ వ్యవహారాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైరల్ అయిన వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో రీనా ఉద్యోగం ఊడింది. ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్పీ యమున ప్రసాద్ వెల్లడించారు. రీనా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఆమె చుట్టూ కొందరు పోలీసులు కూడా కూర్చుని ఉండటం గమనార్హం. ఆ వీడియోను గమనిస్తే మరో కానిస్టేబుల్ కూడా ఆమె లంచం తీసుకునేందుకు సహకరించినట్లు తెలుస్తోంది.

    ఇది కూడా చదవండి: Married Woman: పెళ్లయింది.. మరో వ్యక్తితో లవ్.. అర్ధరాత్రి లవర్‌కు కాల్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది..

    ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అసలు సదరు వ్యక్తికి సంబంధించిన పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు, రీనాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పని మరో కానిస్టేబుల్ అనిల్ సింగ్ దేవన్‌కు అప్పగించగా.. రీనా లంచం తీసుకుంటూ దొరికిపోయింది. అనిల్ సింగ్ దేవన్ కూడా రీనాతో పాటు వీడియోలో కనిపించాడు. కేవలం రీనాను మాత్రమే విధుల్లోంచి తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమెతో పాటు వీడియోలో ఉన్న దేవన్‌ను విధుల నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: