A VIDEO HAS GONE VIRAL FROM CHHINDWARA IN MADHYA PRADESH WHERE A WOMAN IS WALKING ON BLAZING COALS SSR
Viral: అత్త నిందలేసిందని భర్త కళ్ల ముందే నిప్పులపై నడిచిన కోడలు.. వైరల్గా మారిన వీడియో..
వీడియోలోని దృశ్యం, నిప్పులపై నడిచిన మహిళ
అత్త మోపిన నిందను నిజం కాదని నిరూపించడానికి కోడలు కాళ్లకు చెప్పులు లేకుండా నిప్పులపై నడిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని రామ్కోన గ్రామంలో ఆగస్ట్ 17న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
చింద్వారా: అత్త మోపిన నిందను నిజం కాదని నిరూపించడానికి కోడలు కాళ్లకు చెప్పులు లేకుండా నిప్పులపై నడిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని రామ్కోన గ్రామంలో ఆగస్ట్ 17న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఎవరో తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారి.. ఈ ఘటన గురించి ప్రపంచానికి తెలిసింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో అత్తాకోడలి మధ్య గొడవొచ్చింది. కోడలు తప్పు చేసిందని అత్త ఆరోపించింది. అయితే.. తాను ఏ తప్పూ చేయలేదని కోడలు వాదించిది. ఈ వ్యవహారం కాస్తా ఊరిలోని బాబా వద్దకు చేరింది. ఆయన ఆ కోడలి సచ్ఛీలతను నిరూపించుకునేందుకు ఒక పరీక్ష పెట్టాడు. అదే నిప్పుల మీద నడవడం. ఆ నిప్పుల మీద నడుచుకుంటూ కోడలు వెళ్లగలిగితే ఆమె ఏ తప్పూ చేయలేదని ఆ ఊరి జనం నమ్ముతారు. ఈ పరీక్షకు కోడలు అంగీకరించింది.
మంగళవారం రాత్రి ఆ గ్రామస్తుల సమక్షంలో కణకణ మండుతున్న నిప్పులపై ఆ వివాహిత నడుచుకుంటూ వెళ్లింది. ఆమె ఆ నిప్పులపై నడుస్తున్న సమయంలో అక్కడే ఆమె భర్త కూడా ఉన్నాడు. అయినా చూస్తూ నిలబడ్డాడే తప్ప ఇదేంటని అడగలేదు. మొత్తానికి ఈ పరీక్షలో కోడలు నెగ్గింది. తన కోడలి విషయంలో తానే పొరపాటు పడ్డానని అత్త ఒప్పుకుంది.
ఇక్కడ మరో కొసమెరుపేంటంటే.. నిప్పులపై ఒక్కసారి ఇటు నుంచి అటు వెళ్లడం మాత్రమే కాదు. అటు నుంచి ఇటు కూడా రావాలి. ఇలా రెండుసార్లు నడిచినప్పుడే ఆ పరీక్షలో నెగ్గినట్టు. ఆ కోడలు మొత్తానికి ఈ అగ్ని పరీక్షలో నెగ్గి అత్త సర్దుకుపోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అంతేకాదు.. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజుల్లో కూడా ఇవేం పరీక్షలంటూ కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆ కోడలు ధైర్యానికి మెచ్చుకోవాలంటూ ఆమెను పొగుడుతున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.