మూడు నెలల పసికందును పీక్కు తిన్న వీధి కుక్కలు.. తలను, మొండాన్ని వేరు చేసి..

Stray Dogs: సోమవారం రాత్రి మూడు నెలల పసికందును లాక్కెళ్లి పీక్కు తిన్నాయి. రాత్రి సమయంలో ఇంటి బయట నిద్రిస్తుండగా.. అక్కడికి వచ్చిన వీధి కుక్కలు పసికందును లాక్కెళ్లి పోయాయి.

news18-telugu
Updated: June 25, 2019, 4:15 PM IST
మూడు నెలల పసికందును పీక్కు తిన్న వీధి కుక్కలు.. తలను, మొండాన్ని వేరు చేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి.. చీకటి పడిదంటే చాలు గుంపులు గుంపులుగా చేరి వణుకు పుట్టిస్తున్నాయి. ప్రజలు కనిపిస్తే మూకుమ్మడిగా దాడి చేస్తూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని షహరన్‌పూర్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి మూడు నెలల పసికందును లాక్కెళ్లి పీక్కు తిన్నాయి. రాత్రి సమయంలో ఇంటి బయట నిద్రిస్తుండగా.. అక్కడికి వచ్చిన వీధి కుక్కలు పసికందును లాక్కెళ్లి పోయాయి. ఒక్కసారిగా అన్ని కుక్కలు కలిసి ఆ బాలుడిపై దాడి చేసి పళ్లతో శరీరాన్ని పీకేశాయి. దీంతో బాలుడి తల మొండెం వేరైంది. తలను ఎత్తుకెళ్లి పోయిన వీధికుక్కలు.. శరీరాన్ని దగ్గరలోని పొలాల్లో పడేశాయి. ఉదయం లేచిన కుటుంబ సభ్యులు పిల్లాడి కోసం చూసేసరికి పొలంలో తలలేని శరీరం కనిపించింది.

కాగా, ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో వీధి కుక్కలు దాదాపు డజను మంది చిన్నారులను బలి తీసుకున్నాయి. దీంతో తల్లిదండ్రులు వారి పిల్లల్ని స్కూలుకు పంపించడమే మానేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు వీధి కుక్కలను పట్టుకెళ్లి దాడులు చేయకుండా చికిత్స చేయిస్తున్నారు.
First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading