HOME »NEWS »CRIME »a thief who robbed money from rich people and give to poor arrested in delhi ms

పెద్దలను దోచి... పేదలకు పంచి.. ఢిల్లీలో అరెస్టైన బీహార్ రాబిన్ హుడ్

పెద్దలను దోచి... పేదలకు పంచి.. ఢిల్లీలో అరెస్టైన బీహార్ రాబిన్ హుడ్
ప్రతీకాత్మక చిత్రం

అతడొక దొంగ. లగ్జరీ కార్లు, అత్యంత విలువైన వస్తువులను దోచేస్తాడు. దోచి ఏం చేస్తాడు..? ఏ దొంగైనా ఏం చేస్తాడు..? ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తాడు.. కానీ ఈ దొంగ మాత్రం అలా కాదు. తాను దొంగతనం చేయా వచ్చిన సొమ్మును పేదలకు పంచుతున్నాడు.

  • News18
  • Last Updated: January 11, 2021, 20:10 IST
  • Share this:
    అతడొక దొంగ. దొంగ అంటే ఏదో చిన్నా చితక దొంగతనాలు చేసుకుని కాలం వెల్లదీసేవాడు అనుకుంటున్నారా..? కాదు. పెద్ద పెద్ద లగ్జరీ కార్లు, అత్యంత విలువైన వస్తువులను దోచేస్తాడు. దోచి ఏం చేస్తాడు..? ఏ దొంగైనా ఏం చేస్తాడు..? ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తాడు.. కానీ ఈ దొంగ మాత్రం అలా కాదు. తాను దొంగతనం చేయా వచ్చిన సొమ్మును పేదలకు పంచుతున్నాడు. పంచడం అంటే ఏదో కనిపించిన వాళ్లకు సాయం చేసి చేతులు దులుపుకోవడం కూడా కాదండోయ్.. ఏకంగా ఓ రెండు స్వచ్ఛంద సంస్థలను కూడా నడుపుతున్నాడు. అతడి టైం భాగోలేక ఇటీవలే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా దొంగ.. ఏంటా కథా కమామిషు. అయితే ఇది చదవండి.

    బీహార్ లో ని సీతామర్హికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్ హుడ్ ఉజలే చేసే వృత్తి దొంగతనం. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో భాగా డబ్బున్నవాళ్లలో దొంగతనాలు చేసే ఇర్ఫాన్... ఆ సొమ్మునంత మంచి పనికి ఉపయోగిస్తున్నాడు. ఇర్ఫాన్, అతడి ముఠా ఈ మూడు రాష్ట్రాలలో పెద్ద పెద్ద వాళ్ల ఇండ్లలోంచి దోచిన కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను సొమ్ము రూపంలో మార్చుతారు. ఆ పిమ్మట దానిని ఇర్ఫాన్ నడిపిస్తున్న స్వచ్ఛంద సేవ కోసం వాడుతున్నారు.



    సీతామర్హిలో అతడి పేరు చెబితే తెలియనివాళ్లుండరు. అవసరముందని ఎవరైనా అతడి దగ్గరికెళ్తే వారికి కచ్చితంగా సాయం చేసి పంపించే వ్యక్తి ఇర్ఫాన్ అని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ ఏడాది మార్చిలో అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అతడు పోటీ చేస్తుండటం గమనార్హం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అతడి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో..

    కాగా.. ఇటీవలే పంజాబ్ లోని జలందర్ లో రూ. 26 లక్షల విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను ఇర్ఫాన్ ముఠా సభ్యులు దొంగిలించారు. దాంతో పాటు ఢిల్లీలో కూడా ఒక లగ్జరీ కారును దొంగిలించారు. ఈ కేసులో ఇర్ఫాన్ పట్టుబడ్డాడు. అయితే అతడు పట్టుబడటం ఇదే తొలిసారి కాదని.. అంతకుముందు చాలాసార్లు అతడు జైలుకు వెళ్లొచ్చాడని తెలుస్తున్నది. ఏదేమైనా ఇర్ఫాన్ దోచుకున్న సొమ్మును పేదల కోసం సాయం చేయడానికి.. వారికి ఆరోగ్య శిబిరాలను నిర్వహించడానికి వాడుతుండటం గమనార్హం.
    Published by:Srinivas Munigala
    First published:January 11, 2021, 20:02 IST

    टॉप स्टोरीज