హోమ్ /వార్తలు /క్రైమ్ /

Interesting thief story: మొబైల్ దుకాణంలో దొంగతనం.. బెడిసికొట్టిన ప్లాన్ ! ఎక్కడ కొట్టేశాడో అక్కడే దొరికిపోయాడు !!

Interesting thief story: మొబైల్ దుకాణంలో దొంగతనం.. బెడిసికొట్టిన ప్లాన్ ! ఎక్కడ కొట్టేశాడో అక్కడే దొరికిపోయాడు !!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎవరికి దొరకకుండా ఉండాలంటే తాను ఉండే చోట కాకుండా వేరే రాష్ట్రం వెళ్లి దొంగతనం చేసి జల్సాలు చేయాలనుకున్నాడు. పథకం ప్రకారం దొంగతనం చేశాడు. కానీ మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి పోలీసులకు దొరికిపోయాడు.

  అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఇక తాను చేసే పనికి ఎవరు తనను అనుమానించి పట్టుకోలేరనుకున్నాడు. అయితే తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది అన్నట్లు… తాను వేసిన ప్లాన్ బైడిసికొట్టింది. ఎక్కడైతే తాను దొంగతనానికి (Theft) పాల్పడ్డాడో చివరకు అక్కడికే వచ్చి పోలీసులకు దొరికిపోయాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకి ఆ ప్లాన్ ఏమిటి ?, ఆ ప్లాన్ వేసింది ఏవరు ? అతడు చేసిన దొంగతనం ఏమిటి (Interesting thief story) ? తెలుసుకోవాలని ఉందా అయితే ఇది పూర్తిగా చదవండి.  మంచిర్యాల (Mancherial) జిల్లా బెల్లంపల్లి (Bellampalli) పట్టణంలోని ఓ మొబైల్ దుకాణంలో దొంగతనం జగిరింది. 17 సెల్ ఫోన్లు, ఐదు వేల రూపాయల నగదును ఎత్తుకెళ్ళాడు. అయితే దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

  బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో..

  ఇందులో భాగంగా ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో  అనుమానాస్పదంగా ఓ వ్యక్తి  కనిపించడంతో పోలీసులు అతని వద్దకు వెళ్ళి వివరాలు ఆరా తీశారు. అనుమానంతో అతని వద్ద ఉన్న బ్యాగను తని తనిఖీ చేయగా  ఏడు కొత్త సెల్ ఫోన్ లు, మూడు వేల రూపాయల నగదు  లభించింది. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగ్ లో ఉన్న కొత్త సెల్ ఫోన్ లు ఎక్కడివి అని విచారించగా నిందితుడు మొబైల్ షాప్ లో చేసి దొంగతనం గురించి చెప్పి నేరం అంగీకరించాడు. ఏడు సెల్ ఫోన్లు, మూడువేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడు ఆసక్తికర వివరాలను వెల్లడించాడు.

  పట్టుబడ్డ నిందితుడి పేరు యాద రామ్ పటేల్. (Yada ram patel) నిందితుడు చత్తీస్ ఘడ్ (Chhattisgarh) రాష్ట్రంలోని మహాసముద్ జిల్లా ఫితోర్ తాలుకాలోని మాలర్ ఫరోడా వాసి. అయితే బస్ క్లీనర్ గా పని చేస్తూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జీవిస్తున్నాడు. పని చేస్తే వచ్చిన ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.  గతంలో ఒరిస్సా రాష్ట్రంలో మొబైల్ షాప్ (Mobile shop) లో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్ళాడు. జైలు నుండి విడుదల అయ్యాక కూడా తన ప్రవర్తన లో మార్పు రాక మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని తన నివాసం ఉండే ప్రాంతాల్లో దొంగతనం చేస్తే పోలీసులకు సులభంగా దొరికిపోతాననే భయంతో వేరే రాష్ట్రంలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.

  తను వేసుకున్న పథకం  ప్రకారం ఈ నెల 20న  రైలు ద్వారా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లి పగటిపూట బజారు ఏరియాలోని  సెల్ ఫోన్ దుకాణాల్లో దొంగతనం చేయడానికి సులభంగా ఉన్న షాప్ కోసం రెక్కి నిర్వహించాడు.  బెల్లంపల్లి మెయిన్ రోడ్డు ఎస్బిఐ బ్యాంక్ పక్కన ఉన్న మొబైల్ ఫోన్ ల షాప్ పైకప్పు రేకులు తొలగించడానికి సులభంగా ఉంటుందని గమనించి మరుసటి రోజు రాత్రి రెండు గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి దుకాణం పైకప్పు ఊడదీసి షాప్ లోకి దూరి అందులో ఉన్న 17 కొత్త మొబైల్ ఫోన్స్ ,  గల్లాపెట్టె లో ఉన్న చిల్లర డబ్బులు సుమారు  ఐదు వేల రూపాయలను దొంగిలించాడు.

  అదే రోజు ఉదయం రైలెక్కి మహారాష్ట్ర వెళ్లిపోయి దొంగతనం చేసిన 17 మొబైల్ నుంచి 10 మొబైల్ ఫోన్స్ ను మహారాష్ట్ర నాగపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకుని వాటి ద్వారా వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు చేశాడు. మిగిలిన సెల్ ఫోన్స్ నుబ్యాగ్ లో ఉంచుకొని తిరిగి మళ్ళీ బెల్లంపల్లి ఏరియా లో దొంగతనం చేయడానికి వస్తుండగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సదరు దొంగ వేసిన ప్లాన్ బెడిసికొట్టి మరోసారి కటకటాలపాలయ్యాడు. ఇదీ జరిగిన కథ. ఆ సెల్ ఫోన్ ల దొంగను పట్టుకున్న పోలీసు ఇన్స్ పెక్టర్ రాజు, ఇతర సిబ్బందిని మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Adilabad, Crime news, Mancherial, Theft

  ఉత్తమ కథలు