మద్యం మత్తులో ఖాకీలు.. పోలీస్ కార్‌తో పరారైన దొంగ?

పోలీసులు మద్యం మత్తులో ఉన్న విషయాన్ని గమనించే దొంగ ఇంత పని చేశాడని ఇతర పోలీసులు చెవులు కొరుక్కుంటున్నారు.

news18-telugu
Updated: September 20, 2019, 8:15 PM IST
మద్యం మత్తులో ఖాకీలు.. పోలీస్ కార్‌తో పరారైన దొంగ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో గత ఐదు రోజుల క్రితం అలంపూర్ చౌరస్తా లో ఓ వ్యక్తి దొంగతనం చేస్తుండగా పట్టుకున్న గ్రామస్తులు ఉండవెల్లి పోలీసులకు అప్పగించారు. ఉండవెల్లి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు విచారణ నిమిత్తం నాలుగు రోజులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే గురువారం తెల్లవారుజామున పోలీసులు ఏమరుపాటుగా ఉండడంతో నిందితుడు చాకచక్యంగా పోలీస్ స్టేషన్ కు చెందిన ఇన్నోవా వాహనాన్ని తస్కరించి పారిపోయాడు. తెల్లారిన తర్వాత దొంగతో పాటు కార్యాలయానికి చెందిన వాహనం కూడా లేని విషయాన్ని గమనించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా దొంగని పట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. జాతీయ రహదారి వెంట గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల సీసీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. అయినా దొంగ ఆచూకీ లభించకపోగా అసలు ఏం చేయాలో పోలీసులకు పాలుపోలేదు.

ఇంతలోనే ఉండవెల్లి మండల పరిధిలోని తక్కశిల అనే గ్రామంలో వాహనం ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని వాహనాన్ని గుట్టు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పటికే పోలీసుల్లో సమన్వయ లోపం కారణంగా ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట మీడియా నోట పడడంతో మీడియా నోట పడడంతో పడడంతో ఓ పోలీసు అధికారి పత్రికల్లో రాయ వద్దని ఒత్తిడి తెచ్చారు. సంఘటన జరిగిన రాత్రి పోలీస్ స్టేషన్లో నలుగురు సిబ్బంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారంతా మద్యం మత్తులో ఉన్న విషయాన్ని గమనించే దొంగ ఇంత పని చేశాడని ఇతర పోలీసులు చెవులు కొరుక్కుంటున్నారు. పారిపోయిన దొంగ తెలకపల్లి మండలం గట్టు నెల్లి కుదురు గ్రామానికి చెందిన వ్యక్తిగా, ఇతను హైదరాబాదులోని ఎర్రమంజిల్ ప్రాంతంలో మెకానిక్ గా పని చేస్తూ పలు కేసుల్లో ఉన్నట్లు గుర్తించారు.

ఈ సంఘటనలో నలుగురు పోలీసు సిబ్బందితో పాటు ఎస్సైపై కూడా సస్పెన్షన్ చర్యలు తీసుకొన్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై పోలీసులు మరో వాదన వినిపిస్తున్నారు. దొంగ పారిపోయిన మాట వాస్తవమే. పారిపోయిన దొంగ కోసం మా కారులో వెంబడించాం. అయినా దొంగ దొరకలేదు. పోలీసుల వాహనమే చోరికి గురైనట్లు వస్తున్న పుకార్లు నిజం కాదని చెప్పుకొచ్చారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు