దొంగతనం కోసం వచ్చి.. బావిలో పడి మృతి..

దొంగతనం చేసేందుకు అక్కడ తచ్చాడుతుండడం.. వారు ఆ ప్రాంతంలో కొత్తగా కన్పిస్తుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వారిని మీరెవరు..? ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు.

news18-telugu
Updated: July 12, 2020, 2:51 PM IST
దొంగతనం కోసం వచ్చి.. బావిలో పడి మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ ముగ్గురు దొంగలు ఒక ప్రాంతంలో దొంగతనం చేసేందుకు వచ్చారు. కానీ అక్కడి స్థానికులు వీరిని గమనించి.. ఆ ప్రాంతానికి కొత్తవారు కావడంతో మీరెవరంటూ ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ఒకరిని అప్పటికే పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయేందుకు పరుగులు తీశారు. అందులో ఓ వ్యక్తి పారిపోతూ రోడ్డు వెంట ఉన్న బావిలో పడి మృతిచెందాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం కోసం వచ్చారు. దొంగతనం చేసేందుకు అక్కడ తచ్చాడుతుండడం.. వారు ఆ ప్రాంతంలో కొత్తగా కన్పిస్తుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

వారిని మీరెవరు..? ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. దీంతో పొంతలేని సమాధానాలు చెబుతుండడాన్ని గమనించి గ్రామస్తులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ఒకరిని గ్రామస్తులు పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయేందుకు పరుగు అందుకున్నారు. ఈ క్రమంలోనే పరిగెత్తే ఇద్దరిలో ఓ వ్యక్తి జాతీయ రహదారి పక్కన ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో పడ్డ యువకుడి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చనిపోయిన యువకుడిని హైదరాబాద్‌కు చెందిన ఉమర్‌గా గుర్తించారు. వీరు సెటాప్ బాక్సుల చోరీ కోసం వచ్చి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చనిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading