పదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్... హత్య చేసి... బయోగ్యాస్ ట్యాంకులో పడేసి...

ఓ పదేళ్ల బాలికను రేప్ చేసి ఆ తర్వాత హత్య  చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కట్ని పట్టణంలో జరిగింది. 

Suresh Rachamalla | news18-telugu
Updated: March 5, 2019, 12:33 AM IST
పదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్... హత్య చేసి... బయోగ్యాస్ ట్యాంకులో పడేసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ పదేళ్ల బాలికను రేప్ చేసి ఆ తర్వాత హత్య  చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కట్ని పట్టణంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రోడ్డుపై వెళ్తున్న ఓ పదేళ్ల బాలికపై కొందరు దుండగుల కన్నుపడింది. వెనకాలే ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్లాక... ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. సరిగ్గా అప్పుడే... బాలికను చేరిన దుండగులు... ఒక్కసారిగా మృగాల్లా ఉరికారు. ఆ బాధితురాలి నోరు మూసేసి... తుప్పల్లోకి ఎత్తుకుపోయారు. ఆ చిన్నారి గిలగిలా కొట్టుకుంటుంటే... ఏ మాత్రం జాలి లేని ఆ దుండగులు... ఒంటరి బాలికపై అరాచకానికి పాల్పడ్డారు.

గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గులు... ఆ తరువాత ఆ అభాగ్యురాలి గొంతు నులిమారు. అంతమంది గొంతు నొక్కేస్తుంటే నిస్సహాయురాలైన ఆ బాలిక... విలవిలలాడుతూ ప్రాణాలు విడించింది. శవాన్ని సమీపంలో ఉన్న ఓ బయోగ్యాస్‌ ట్యాంకులో పడేసి వెళ్లిపోయారు.

బుధవారం తన సమీప బంధువు వెంట వెళ్లిన బాలిక... ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆ బంధువుని అడిగారు. తనకు తెలియదన్న అతను... బాలిక ఇంటికి తిరిగి వచ్చేసి ఉంటుందని అనుకున్నట్లు తెలిపాడు. షాక్ తిన్న తల్లితండ్రులు ఆమె కోసం ఊరంతా  వెతికారు. ఎంతకీ ఆచూకీ తెలియక పోవడంతో... చివరకు పోలీసుల్ని ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు కట్నికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో బయోగ్యాస్‌ ట్యాంకు లోంచి దుర్వాసన వస్తుందని తెలియడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా... శవం కనిపించింది. దీంతో ఆ శవం బాలికదే అని నిర్థారించుకొని..పోస్ట్ మార్టమ్‌ పరీక్షకు పంపారు. ఆ పరీక్షలో అసలు విషయం తెలిసింది. దుండగుల కోసం గాలిస్తున్నారు.



అబ్బురపరిచే కుంభమేళా- 2019 ఫోటోస్.. విహంగ వీక్షణం...
Published by: Suresh Rachamalla
First published: March 5, 2019, 12:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading