• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A TEENAGER WHO RAPED A 10 YEAR OLD BOY IN UTTAR PRADESH BN

బాలుడిపై యువకుడి అత్యాచారం.. ఆపై బతికుండానే నిప్పుపెట్టి..

బాలుడిపై యువకుడి అత్యాచారం.. ఆపై బతికుండానే నిప్పుపెట్టి..

విషయం తెలిసిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తన వెంట వచ్చిన బాలుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియని ఆ బాలుడు భయంతో కేకలు వేస్తూ ఏడ్చాడు.

  • Share this:
    కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుద్ధులు ఏం చేస్తున్నారో వారికే తెలియని విధంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారులు, మహిళలపైనే బాలురపైనా అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బాలుడిపై అసహజ అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఏకంగా బతికుండగానే నిప్పుపెట్టి కాల్చేందుకు ప్రయత్నించాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాకు చెందిన సల్మాన్ అనే యవకుడు ఓ పది సంవత్సరాల బాలుడిని ఆడుకుందాం రా అంటూ పిలిచాడు. ఆ యువకుడి మాటలు నమ్మి అతడి వెంట వెళ్లాడు. తన వెంట వచ్చిన బాలుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియని ఆ బాలుడు భయంతో కేకలు వేస్తూ ఏడ్చాడు. దీంతో ఆగ్రహించిన సదరు యువకుడు బాలుడి గొంతు నులుముతూ హత్యాచారానికి ప్రయత్నించాడు.

    దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చనిపోయాడని భావించిన ఆ యువకుడు బాలుడిని సమీపంలోని పొదల్లోకి లాకెల్లి నిప్పుపెట్టి కాల్చేందుకు ప్రయత్నించాడు. శరీరానికి మంటలు అంటుకోవడంతో స్పృహలోకి వచ్చిన బాలుడు రక్షించాలంటూ కేకలు వేశాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: