దారుణం.. నిబంధనలు పాటించాలన్నందుకు తుపాకీతో కాల్చిచంపేశారు..

లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని చెప్పినందుకు ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపారు. అడ్డు వచ్చిన అతడి తమ్ముడిని సైతం చితకబాదారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: April 3, 2020, 9:10 PM IST
దారుణం.. నిబంధనలు పాటించాలన్నందుకు తుపాకీతో కాల్చిచంపేశారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. ఇదేంటని అడిగిన వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని చెప్పినందుకు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో కొంతమంది వ్యక్తులు రోడ్డుపై గుంపుగా చేరారు. దీంతో గుంపుగా ఉండడాన్ని గమనించిన జావేద్ అనే యువకుడు లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి రావొద్దని సూచించాడు.

అలా చేయడం సరికాదని, నిబంధనలను ఉల్లంఘించడం చట్టవ్యతిరేక చర్య కిందకు వస్తుందని హెచ్చరించాడు. దీంతో గుంపుగా చేరిన వ్యక్తులు ఆగ్రహంతో జావేద్‌తో పాటు అతడి సోదరుడిపై విచక్షణరహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా జావేద్‌ను తుపాకీతో కాల్చి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేయగా, అప్పటికే నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.
First published: April 3, 2020, 9:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading