A TEACHER SEXUALLY HARASSES A STUDENT IN THE NAME OF ONLINE CLASSESS IN SANGAREDDY DISTTICT VB
గదికి వచ్చి కోరిక తీర్చు.. లేదంటే ఫెయిల్ చేస్తా.. అంటూ విద్యార్థినిని వేధించిన కీచక ఉపాధ్యాయుడు.. చివరకు ఏమైందంటే..
ప్రతీకాత్మక చిత్రం
Sangareddy District: విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఆ విద్యార్థిని పట్ల కీచకుడిలా మారాడు. ఆన్ లైన్ క్లాసుల పేరిటి ఓ పంతులు అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. కామ వాంఛ తీర్చాలని.. లేదంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కోవలోనే సంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఆన్ లైన్ క్లాసుల పేరిట ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. కరోనాకు భయపడి అమ్మాయిలు కాలేజీలకు వెళ్లకపోయినా కామాంధులు మాత్రం ఏదో రూపంలో వాళ్లను వేధిస్తూనే ఉన్నారు.
ప్రైవేటు కళాశాలలోని పని చేస్తున్న వినయ్రాజ్ అనే అధ్యాపకుడు కీచకుడిలా మారాడు. ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థిని ఫోన్ నెంబర్ తీసుకుని, వికృతంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆ విద్యార్థిని ఫోన్ నంబర్ ను సేకరించాడు. నగ్న వీడియో లు పంపించాలంటూ వేధింపులు పెట్టడం మొదలు పెట్టాడు. గతేడాది టెన్త్ క్లాస్ చదువుతుండగా బాధితురాలికి ఆన్లైన్ క్లాసులు చెప్పాడు. ఆ పరిచయంతో ఇలా వేధించడంతో బాధితురాలు విసిగిపోయింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
తరచూ ఆమెకు అశ్లీల చిత్రాలు పంపుతూ లైంగిక వేధింపులకు ఒడిగట్టాడు . నగ్న వీడియోలు పంపాలని, తన గదికి వచ్చి కోరిక తీర్చాలని వేధించాడు. అలా చేస్తేనే ఎక్కువ మార్కులు వేస్తానని, లేదంటే ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. అమ్మాయి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్రాజ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఇలాంటి ఘటనలకు పాల్పడటం బాధాకరం. దిశా నిర్దేశం చేయాల్సిన పంతులే ఇలాంటి పనులకు పాల్పడితే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థంకంగా మారుతుంది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మాయి తరఫు బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.