Home /News /crime /

A SURVEY OF 400 GUNSHOT WOUNDS IN FOUR DAYS IN THE UNITED STATES SNR

గన్‌ కల్చర్‌కి ఆ దేశం ఫేమస్..4రోజుల్లో ఎంత మంది చనిపోయారో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gun deaths: అగ్రరాజ్యంలో గన్‌కల్చర్‌ పెట్రేగిపోతోంది. రోజు రోజుకు తుపాకులు వాడే వారి సంఖ్య అమెరికాలో పెరగడంతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన నాలుగు రోజుల్లోనే నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఓ సర్వే వెల్లడించింది. ఏడాదిలో ఇంకా ఎంత మంది బుల్లెట్లకు బలవుతారోనన్న టెన్షన్ అక్కడి ప్రజలను కలవరపెడుతోంది.

ఇంకా చదవండి ...
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి నాలుగు రోజులైందో లేదో అక్కడ తుపాకీ తూటాలకు బలైపోయిన వారి సంఖ్య నాలుగు వందలు దాటేసింది. అంటే రోజుకు వంద మంది చొప్పున జనవరి (January)ఫస్ట్ నుంచి 4వ తేది వరకూ 400మంది కేవలం తుపాకీ బుల్లెట్లు (Gun bullets)తగిలి చనిపోయారు. ఇంతటి హింసాత్మక ప్రదేశం ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా ..? ఎక్కడో కాదు అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా(America)లోనే ఇంతటి దారుణాలు జరిగింది. ఈవిషయం ఎలా తెలిసిందంటే గన్‌ వయలెన్స్‌ ఆర్త్కైవ్ (Gun Violence Archive)జరిపిన ఆన్‌లైన్‌ సర్వే(Online survey)లో బయటపడింది. జనవరి 4వ తేది వరకూ వాళ్ల లెక్కల ప్రకారం అమెరికా సంయుక్త (US)రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిది చోట్ల సామూహిక కాల్పులు(Mass shootings)జరిగినట్లుగా గుర్తించారు. ఒక్క ఘటనలోనే నలుగురు మృతి చెందినట్లుగా తేల్చారు. ఈ కాల్పుల ఘటనల్లో నాలుగు రోజుల్లోనే 349మంది గాయపడ్డారు. గతేడాదిలో మొత్తం 691చోట్ల ఎదురు కాల్పులతో అత్యధిక కాల్పులు జరిగాయి. సర్వే జరిపిన లెక్క ప్రకారం కాల్పుల ఘటనలతో గతేడాది టాప్ ప్లేస్‌లో నిలిచింది. అంతే కాదు జాతీయ తుపాకీ ఆయుధాల సర్వే లెక్కల ప్రకారం అమెరికాలో ఉండే వయోజనుల్లో వన్‌ థర్డ్‌ పర్సంటేజ్ తుపాకులు వాడుతున్నట్లుగా గుర్తించారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న జనాభాలో సుమారు 81.4 మిలియన్‌ (Million)మంది తుపాకులు కలిగి ఉన్నట్లుగా సర్వేలో వెల్లడించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యధికంగా తుపాకులు ఉపయోగించే దేశాల్లో అమెరిక (America)ఫస్ట్ ప్లేసులో నిలిచినట్లుగా సర్వే వర్గాలు వెల్లడించాయి.

అక్కడ గన్ కల్చర్ కామన్..
అగ్రరాజ్యంలో గన్‌ కల్చర్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఏడాది వందల సంఖ్యలో కాల్పులకు తెగబడటం, వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ వస్తోంది. ఈ నూతన సంవత్సరం మొదటి రోజు కూడా అలాంటి కాల్పుల ఘటనే అందర్ని ఉలిక్కిపడేలా చేసింది. మిసిసిపిలోని గల్ఫ్ పోర్ట్‌లో జరిగిన న్యూఇయర్‌ పార్టీలో కాల్పుల మోత మోగింది. ఈఘటనలో ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారిలో కూడా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

న్యూఇయర్‌ రోజే దూసుకొచ్చిన బుల్లెట్లు..
న్యూఇయర్‌ సెలబ్రేషన్‌లోనే కాల్పుల మోత మోగడం..తుపాకుల నుంచి బుల్లెట్ల వర్షం కురవడంతో ఆరోజు పార్టీకి వచ్చిన వాళ్లంతా హడలిపోయారు. ఈవెంట్ అంతా కాల్పుల మోతతో దద్దరిల్లిపోవడంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని గన్‌ ఫైరింగ్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అసలు పార్టీలో ఎంత మంది పాల్గొన్నారు. గొడవ ఎక్కడ మొదలైందో తెలిస్తే కానీ కాల్పులకు తెగబడ్డ వాళ్లు ఎవరో చెప్పలేమని అమెరికన్ పోలీసులు తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: America, Gun fire, Us shooting

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు